సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరో హీరోయిన్లకు వివాహ విషయంలో చాలా తొందరపడి వివాహం చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది పలు రకాల ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది నటీనటులు ఆలస్యమైన సరే ఆలోచించి అడుగు వేయాలని ఆలోచిస్తూ ఉన్నారు.. ఎందుకంటే ఎంతోమంది హీరో హీరోయిన్లు తొందరపడి వివాహాలు చేసుకొని విడాకుల వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే వివాహం చేసుకోబోయే సెలబ్రెటీలు ఇటువంటివి ఎదురుకాకుండా ఉండడానికి ముందుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.


ఇలాంటి వారిలో హీరోయిన్, బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి కూడా ఒకరు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు కొన్ని అయినప్పటికీ నటిగా కూడా కొంతవరకు సక్సెస్ సాధించింది. ఆ తర్వాత కొత్త హీరోయిన్లు రాకతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాలేకపోయాయి. దీంతో కోలీవుడ్ లో వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది .అక్కడ వరుస సినిమాలు చేస్తూనే బిజీగా ఉంటోంది .ఆ తర్వాత టాలీవుడ్లోకి బిగ్ బాస్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించింది.

మొదటినుంచి చివరి వరకు బిగ్ బాస్ లో ఎటువంటి విమర్శలు ఎదుర్కోకుండా తన ఆట తీరుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది బిందు మాధవి.. తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈమె టైటిల్ విన్నారుగా కూడా నిలిచింది.ఈ మధ్యనే వరుస సినిమాలు వెబ్ సిరీస్లలో చేస్తూ బాగానే సక్సెస్ అవుతోంది. ఈ మధ్యకాలంలో అందాల ఆరబోత విషయంలో కూడా కాస్త అందరిని ఆకట్టుకుంటుంది బిందు మాధవి. రీసెంట్గా తాను ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ సోలో పాల్గొని బాగానే సందడి చేసినట్టు కనిపిస్తోంది అందుకు సంబంధించిన ఒక ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది .ఇందులో ఓంకార్ పెళ్లి గురించి ప్రశ్నించగా.. తనకు ఇప్పుడైతే ఎవరూ లేరు ఒకవేళ మంచి పర్సన్ దొరికితే ఖచ్చితంగా చేసుకుంటానని అలా తొందరపడి పెళ్లి చేసుకోను ఇబ్బంది పడను అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: