
గతంలో కూడా స్నాక్స్ భోజనంలా చేస్తున్నారా అంటూ కూడా మీడియా పైన చేసిన కామెంట్లు పలు వివాదానికి దారి తీసేలా చేశాయి. దీంతో సుమ మీడియా వారికి క్షమాపణలు కూడా చెప్పింది.ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ వివాదం గురించి నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ సుమ పైన పలు రకాల సెటైర్స్ వేయడం జరిగింది. దీంతో ఏం చేయాలో తెలియక సుమ ఒక్కసారిగా సైలెంట్ గా మారిపోయింది. దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా ఈనెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
ఇందులో ప్రమోషన్స్ లో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ హైపర్ ఆది నితిన్ బ్రహ్మాజీ వంటి వారు సుమ షోలో సందడి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని భాగంగా బ్రహ్మాజీ తింటూ ఉంటే సుమ వెంటనే మీరు తింటూనే ఉన్నారు పళ్ళ సెట్టు ఊడిపోయేను జాగ్రత్త అంటూ కామెంట్స్ చేసింది వెంటనే ఇవి స్నాక్స్ అంటూ కూడా సెటైర్లు వేయడం. జరిగింది.. మరో సందర్భంలో తిన్నారా అంటూ సుమ అడగగా మేము స్నాక్స్ మాత్రమే తిన్నాము భోజనాలు చేయలేదంటూ కూడా ఒక పంచ్ డైలాగులు వేశారు. ఆ తర్వాత నితిన్ నటించిన జయం సినిమాలోని ఒక స్పూఫ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.