తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన ఝాన్సీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె వెండితెర పైన కూడా పలు రకాల చిత్రాలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. నటుడు జోగినాయుడిని ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఝాన్సీ కి ఒక కూతురు పుట్టిన తర్వాత కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారు. అయితే వీరి పెళ్లి బంధం చాలా తక్కువ రోజుల్లోనే విడాకుల బాట పట్టింది కొన్ని రోజులపాటు విడాకుల విషయంలో చాలా గొడవలు కూడా జరిగాయని సమాచారం.


ఫైనల్ గా ఝాన్సీ తన భర్త నుంచి దూరంగా ఉంటూ కూతురితో కలిసి తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అయితే ఝాన్సీ విడాకులు తీసుకున్న తర్వాత ఆమె జీవితంలో ఎన్నో అనుకోకుండా మార్పులు చోటు చేసుకున్నాయని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.. విడాకుల వ్యవహారమే తన కెరీర్ కు చాలా శాపంలా మారిందని తెలియజేయడం జరిగింది  పర్సనల్ గొడవలు ఎక్కువగా వైరల్ గా కావడం వల్ల తన కెరియర్ పైన ఫోకస్ చేయలేకపోయానని ఆ సమయంలో ఎక్కువగా కోర్టుల చుట్టూ తిరగడం వల్ల తనకు వచ్చిన అవకాశాలని చేజారిపోయాయని తెలియజేసింది.


అందువల్లే తనని ఎవరు యాంకరింగ్ గా చేయడానికి పిలవలేదని ఇటీవలే తెలియజేసింది. విడాకుల వల్ల తన కెరీయర్ పాడయిందని ఝాన్సీ ఎంతో ఎమోషనల్ గా తెలియజేసింది. జోగి నాయుడు కూడా కెరియర్ పరంగా అవకాశాలను ఎక్కువగా అందుకోలేకపోయారు. ఈమధ్య కాస్త మద్యానికి కూడా బానిస అయినట్లు సమాచారం.. ఇద్దరి జీవితాలు కూడా విడాకుల వల్లే ఇలా ఇబ్బందులు ఎదురయ్యాయని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు.. ప్రస్తుతం జోగినాయుడు మరొక అమ్మాయిని వివాహం చేసుకొని ఒక కూతురికి కూడా జన్మనిచ్చినట్లు సమాచారం. ఇక అప్పుడప్పుడు పలు రకాల ఇంటర్వ్యూలలో కూడా తమకు జరిగినటువంటి ఇలాంటి ఇబ్బందులను తెలియజేస్తూనే ఉంటారు ఈ జంట.

మరింత సమాచారం తెలుసుకోండి: