తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చు తెలుగు అమ్మాయిగా హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ లయ.. ఎన్నో చిత్రాలలో నటించిన ఈమెకు ఒకానొక సమయంలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.. లయ పూర్తిగా విజయవాడ అమ్మాయి అవడంతో పాటు ఈమె లయోలా కాలేజీలో కూడా చదువును పూర్తి చేసుకుంది మొదటిసారిగా హీరో వేణు నటించిన స్వయంవరం అనే సినిమాతో తెలుగుతెరకు హీరోయిన్గా పరిచయం అయింది.. ఆ తర్వాత బాలకృష్ణ వంటి హీరోలతో కూడా నటించింది.


లయ తెలుగమ్మాయి కావడం వల్ల గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండేది. దీంతో అనుకున్నంత స్థాయిలో ఎక్కువగా అవకాశాలు రాలేదట. ఇక సినిమాలకు దూరమయ్యాక అమెరికాలో ఉండేటువంటి ఎన్ఆర్ఐ డాక్టర్ను వివాహం చేసుకుంది.. లయ ప్రస్తుతం అక్కడే సెటిల్ అయినట్లుగా తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో చిన్న పాత్రలలో నటించింది. తెలుగులో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ నటించడానికి తాను సిద్ధంగానే ఉన్నానంటూ తెలుపుతోంది ఇటీవల సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉండేది.


గతంలో నటుడు ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్న నటుడు అయినా సాయికిరణ్ తో లయ కు మంచి బంధం ఉండేదట. వీరు మొదటిసారి నువ్వే కావాలి సినిమాతో పరిచయమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయికిరణ్ తన ప్రేమ పెళ్లి గురించి కొన్ని ప్రశ్నలు ఎదురవుగా.. లయ తన మధ్య ఎలాంటి ప్రేమలు లేవని అయితే మేమిద్దరం మంచి స్నేహితులను కావడంతో మా జోడి చూడడానికి చాలామంది ప్రేక్షకులు బాగుంటుందని తెలిపే వారని దీంతో తమ తల్లిదండ్రులు కూడా ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పారట.. కానీ తమ కుటుంబ సభ్యులు ఎక్కువగా జాతకాలను నమ్మేవారిని తెలిపారు సాయికిరణ్.. అలా జాతకాలు కలవలేకపోవడంతో పెళ్లి విషయం బ్రేక్ పడిందని తెలిపారు సాయికిరణ్. అయినప్పటికీ ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: