బుల్లితెరపై తెలుగు యాంకర్ గా పేరు సంపాదించిన విష్ణు ప్రియ కెరియర్ మొదట్లో ఎక్కువగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేది. అలాంటి క్రేజీతోనే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టీవీ షోలు ,వెబ్ సిరీస్లలో నటిస్తూ ఉన్నది. అంతేకాకుండా ప్రైవేట్ ఆల్బమ్లలో కూడా నటిస్తూ ఉన్నది విష్ణు ప్రియ. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో కొన్ని విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గురించి కూడా తెలియజేసింది విష్ణు ప్రియ.



తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ తో కూడా తాను చాలా క్లోజ్ గా ఉంటానని ఒకప్పుడు లవ్ చేశారు ఇప్పుడు చేయలేదని వారిని తక్కువ చేయను..అందరినీ సమానంగా చూస్తాను. ఈ విషయంలోనే చాలామంది చూసి ఆశ్చర్యపోతూ ఉంటారని తెలిపింది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫ్యామిలీలలో కూడా తాను బాగా తెలుసు మా అమ్మ చనిపోయినప్పుడు తన ఇద్దరు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ కూడా వచ్చి మరి దగ్గరుండి అన్నిటిని చూసుకున్నారని.. ఇప్పటికి మరొక అబ్బాయి తో డేటింగ్ లో ఉన్నానని ఆ విషయం కూడా వారికి తెలుసు అంటూ తెలిపింది. అయినా కూడా తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటారని తెలిపింది విష్ణు ప్రియ.


విష్ణు ప్రియ తల్లి 2023లో అనారోగ్య సమస్యలతో కన్నుమూసింది.. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు పృథ్వి తో లవ్ గురించి మాట్లాడుతూ పృథ్వి నాకు మంచి ఫ్రెండ్ అని తనతో మంచి బాండింగ్ ఉందని.. పృథ్వీతో ఎలా ఉన్నా కూడా తాను హ్యాపీగానే ఉంటానని తెలిపింది. పృథ్వీ కోసమే కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షోకీ కూడా వచ్చానని వెల్లడించింది.. ఒకవేళ అతను లవ్ అనే టాపిక్ తీసుకువస్తే ఆ విషయం గురించి ఆలోచిస్తానని.. అతనితో లవ్ అయిన ఓకే కాకపోయినా ఓకే అంటూ తెలిపింది. ఒకవేళ పృథ్వి ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా ఓకే చెబుతానంటూ డైరెక్ట్ గానే చెప్పేస్తోంది విష్ణు ప్రియ. అతడు అంటే నాకు అంత పిచ్చి అంటూ తెలియజేసింది విష్ణు ప్రియ.

మరింత సమాచారం తెలుసుకోండి: