రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షోకి మంచి క్రేజ్ ఉన్నది.. ఈ షో కోసమే చాలామంది చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తుంటారు. ఇప్పటివరకు 8 సీజన్లను పూర్తిగా చేసుకున్నటువంటి ఈ షో 9వ సీజన్ కు సంబంధించి ప్రారంభానికి సంబంధించి పలు రకాల సన్నహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరిగా కంటెస్టెంట్లను ఎంపిక చేసే పనిలో కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి హౌస్ లోకి ఎవరెవరు రాబోతున్నారనే విషయంపై అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే గత షోకి కూడా పెద్దగా ఆదరణ రాకపోవడంతో ఈసారి తీసుకునే వారితో సక్సెస్ కొట్టాలని చూస్తోంది బిగ్ బాస్ సంస్థ.



ఈసారి ఎలాంటి మిస్టేక్ జరగకుండా షో రేటింగ్ పెంచుకొని విషయంలో కూడా ప్లాన్ వేస్తున్నారు నిర్వాహకులు. బిగ్ బాస్ 9 సీజన్  కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వైరల్ గా మారుతున్నాయి. కాంట్రవర్సీలకు  కేరాఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి కొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో మై విలేజ్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనిల్ గిల, జబర్దస్త్ రీతూ చౌదరి, సీరియల్ యాక్టర్ కావ్య , బ్రహ్మముడి సీరియల్ దీపిక, అలాగే గత బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్న ప్రియాంక జైన్ ప్రియుడు శివ్ కుమార్ .


అలాగే అలేఖ్య చిట్టి పీకేల్స్ లో ఒకరిని తీసుకుని అవకాశం ఉన్నది. సీరియల్ హీరోయిన్ దేబ్ జానీ , కేరింత హీరో సుమన్ తో పాటు సీరియల్ యాక్టర్ హారిక తదితర పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఉన్న వారి పేర్లు ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం మాత్రం ఎందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: