
ఆర్కే సాగర్ తన భార్య పేరు సౌందర్య అని గతంలో ఆమె ఒక డిజిటల్ మీడియా కంపెనీ కూడా నడిపారని పిల్లలు పుట్టాక గ్యాప్ తీసుకున్నది ఇప్పుడు మళ్లీ ఆత్మన్ ది లేబల్ అనే క్లాత్ బ్రాండ్ ని కూడా మొదలుపెట్టిందంటూ తెలిపారు. ఆర్కే సాగర్ కు ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు. ఇక తన భార్య సౌందర్య కూడా తన బిజినెస్ కు సంబంధించి సోషల్ మీడియాలో అన్ని విషయాలను షేర్ చేస్తుందంటూ తెలియజేశారు. ఇప్పటివరకు తన భార్య గురించి ఎక్కడ చెప్పలేదు ఆర్కే సాగర్ .అంతేకాకుండా తాను నటించిన కొన్ని చిత్రాల వల్ల తాను మోసపోయానంటూ తెలియజేశారు.
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అనేది తనకి బ్యాడ్ ఇన్సిడెంట్ అని ప్రభాస్ ఫ్రెండ్ సెకండ్ లీడ్ అని చెప్పి చేయించుకున్నారని.. సీరియల్స్ బిజీగా ఉన్నప్పటికీ డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరి ఓకే చెప్పాను కానీ సినిమా షూటింగ్ కి వెళ్ళాక అక్కడ మారిపోయిందని..తనకు చెప్పిన క్యారెక్టర్ అక్కడ కనిపించలేదని తెలిపారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించిన కొన్ని సీన్స్ తను వద్దని చెప్పి డిలీట్ చేయమని చెప్పి.. వేరే వాళ్ళని పెట్టుకోమని అక్కడి నుంచి వచ్చేసాను.. చిత్ర బృందం కొంతమేరకు తీసిన సన్నివేశాలను అందులో పెట్టారు. చాలామంది అలాంటి పాత్రలు ఎందుకు చేసావ్ అంటూ తిట్టారని తెలిపారు.
ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో అన్నయ్య పాత్రకి మొదటగా తనని సంప్రదించారని తనకు జరిగిన ఇన్సిడెంట్ ని సుకుమార్ గారికి చెప్పాను అలా జరగదని సుకుమార్ గారు చెప్పిన కూడా తన క్యారెక్టర్ చేయలేకపోయానని తెలిపారు. మొదట ఆది పినిశెట్టి కూడా ఆ పాత్రకు నో చెప్పారట. దీంతో చేద్దామనుకొని ఓకే చెప్పగా కానీ అప్పటికే ఆది పినిశెట్టి కూడా ఓకే చెప్పడంతో ఆయనని తీసుకున్నారని తెలిపారు ఆర్కే సాగర్.