
ఇటీవలే హరిహర వీరమల్ల చిత్రంలో కూడా నటించిన పెద్దగా ప్రాధాన్యత కనిపించలేదు. క్షణం, పుష్ప రంగస్థలం, ఖిలాడి, పుష్ప 2, రజాకర్ తదితర చిత్రాలలో నటించి మెప్పించింది. ఇందులో పాత్రలన్ని కూడా అద్భుతంగానే ఆకట్టుకున్నాయి. అనసూయ తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబుకు వార్నింగ్ ఇచ్చానని తెలియజేస్తోంది.. రామ్ చరణ్ పెద్ది సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తనకి ఒక పాత్ర కావాలని ఏకంగా డైరెక్టర్ కె వార్నింగ్ ఇచ్చాను అంటూ అనసూయ వెల్లడించింది. అయితే డైరెక్టర్ బుచ్చిబాబు నే ఎందుకు పాత్ర అడిగాను అంటే ఆయన రాసుకునే కథలు బలమైన పాత్ర లేడీ క్యారెక్టర్ ఉంటుందని అందుకోసమే పెద్ది సినిమా నుంచి ఒక పాత్ర రాయమని చెప్పానని వెల్లడించింది అనసూయ.
మరి అనసూయ పెద్ది చిత్రంలో ఉంటుందా లేదా అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికి పెద్ది సినిమాను కూడా ఒక మాస్ సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మరి కొంతమంది నటీనటులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. బుచ్చిబాబు సన కేవలం రెండవ సినిమాతోనే మెగా హీరోతో సినిమా చేస్తూ ఉండడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.