
నరసింహపురం, బూట్ కట్ బాలరాజు, ఒరేయ్ బుజ్జిగా, షారుఖ్ ఖాన్ నటించిన బాద్ షా తదితర చిత్రాలలో నటించింది. సినిమాలు, వెబ్ సిరీసులతో పాటుగా తన రిలేషన్షిప్ గురించి అప్పుడప్పుడు పలు విషయాలని తెలియజేస్తూ ఉంటుంది సిరి హనుమంత్. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నది. అయితే వీరిద్దరూ కలిసి ఒక బాబుని కూడా దత్తకు తీసుకొని మరి పెంచుకుంటున్నట్లు సమాచారం. అయితే సిరి, శ్రీహన్ మధ్య ఎలాంటి రూమర్స్ వచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా తమకు నచ్చినట్టుగానే లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.
ఇప్పుడు తాజాగా సిరి హనుమంత్, శ్రీహన్ తో కలిసి వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. చీర కట్టులో చాలా ముస్తాబైన సిరి అందరిని ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ పెళ్లి కాకుండానే ఇలా జంటగా వరలక్ష్మీ వ్రతం చేయవచ్చా అంటూ ఆమెను పలు రకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. పెళ్లి కాకుండానే ఇంతవరకు వచ్చారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.గతంలో కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక కొత్త బిజినెస్ ని కూడా మొదలు పెట్టింది..HK పర్మినెంట్ మేకప్ క్లీనింగ్ అనే పేరుతో బిజినెస్ ని మొదలుపెట్టారు. బ్యూటీ స్కిన్ కి సంబంధించి పలు రకాలు ట్రీట్మెంట్స్ ఇందులో ఉంటాయట. సిరి, శ్రీహాన్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వినిపిస్తున్నాయి.