
గతంలో పలు సీరియల్స్లలో నటించి బాగానే పేరు సంపాదించిన నటుడు ఆలీ రెజాఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించలేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించలేదు కానీ ఈ నటుడు క్లోజ్ ఫ్రెండ్ అయినా యాంకర్ రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆలీ రెజా గురించి తెలిపారు. ఆలీ రెజా ముంబైలో ఒక రెస్టారెంట్ బిజినెస్ ని నడుపుతున్నారని దాంతో అక్కడే బిజీగా మారిపోయారని తెలిపారు. అయితే ఈమధ్య కూడా ఎవరిని పెద్దగా కలవట్లేదు కానీ ఒకప్పుడు తమ కుటుంబంతో ఎక్కువగా కలిసి గడిపే వాళ్ళమని తెలిపారు.
ఆలీరెజా ముంబైలో పార్ట్నర్ గా అప్ఞల్ మావో అనే రెస్టారెంట్ ని మొదలుపెట్టారు. ఈ రెస్టారెంట్ కి సంబంధించి 5 బ్రాంచ్లు ప్రస్తుతం అయితే నడుపుతున్నారని ఇటీవలే వీరు నడుపుతున్న రెస్టారెంట్ ఫుడ్ కు సంబంధించి అవార్డు కూడా అందుకున్నారని తెలుస్తోంది ఆలీ రెజా. అందుకు సంబంధించి వీడియోలను కూడా షేర్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ధ్రువ, రంగమార్తాండ, వైల్డ్ డాగ్, జాక్ , గాయకుడు తదితర చిత్రాలలో నటించారు. సీరియల్స్ విషయానికి వస్తే పసుపు కుంకుమ, ఎవరే నువ్వు మోహిని , మాటే మంత్రం వంటి సీరియల్స్లలో కూడా నటించారు ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో కాంటెస్ట్ గా పాల్గొని బాగానే క్రేజీ సంపాదించారు ఆలీ రెజా.