ఇప్పుడు శాంసంగ్  గెలాక్సీ F41  రాబోతోంది. మన భారతదేశంలో నేడే ఈ ఫోన్ లాంచ్ కాబోతోంది. రానున్న ఈ ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి. వాటి ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 41  సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే తో రాబోతోంది. అలానే దీని బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి....6,000 mAh గా ఉంది. ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే......  64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.

ఇక స్టోరేజ్ విషయానికి వస్తే...... 6 జీబీ ర్యామ్‌ తో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం తో రావొచ్చని తెలుస్తోంది. శాంసంగ్  గెలాక్సీ F41 లాంచ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు స్టార్ట్ అవుతోంది. ఈ ఫోన్ ధర విషయానికి వస్తే..... దీని ధర రూ. 15,000 నుండి రూ. 20,000.మధ్య ఉండొచ్చని అంచనా. ఫ్లిప్‌కార్ట్‌ లో విడుదల చేసిన టీజర్‌ల ప్రకారం,  F41 సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే, సన్నని బెజెల్స్‌తో కలిగి ఉంటుంది అని అంటున్నారు. రంగుల విషయానికి వస్తే....ఈ ఫోన్ బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుందని అంటున్నారు.

ఫోన్ యుఎస్బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ మరియు ఫోన్లో సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉన్నట్లు సూచిస్తుంది. గెలాక్సీ ఎఫ్ 41 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని అంటున్నారు. ఈ ఫోన్ లాంచ్ అయిన తరవాత ఫ్లిప్‌కార్ట్ మరియు శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకం జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్  గెలాక్సీ F41 ను టీజ్ చేస్తూ ఒక ప్రత్యేక పేజీని ప్రచురించింది. ఈ పేజీ ద్వారా ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్లను కూడా చేసుకోవచ్చు. వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉందని టీజర్ ద్వారా తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: