ఇటీవల కాలంలో చాలా మొబైల్ తయారీ సంస్థలు తమ మొబైల్ లను , అతి తక్కువ ధరకే కస్టమర్లకు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్లను ఆకర్షించడం కోసం దిగ్గజ మొబైల్ తయారీ సంస్థలు, ఒక దానిని చూసుకొని మరొకటి ఆఫర్లు ప్రకటిస్తూ, కస్టమర్లకు విందు భోజనం తినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యాపిల్ యూజర్లకు ఒక శుభవార్త. ఇటీవల దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.. అంతేకాదు కొన్ని మోడల్స్ పై ధరలు కూడా తగ్గిస్తూ వాటి ధరలను కూడా ప్రకటించింది..

ఇక కొత్త సిరీస్ ఐఫోన్ 13 లాంచ్ చేసిన తర్వాత ఐఫోన్ 12 సిరీస్ పై ధరలు తగ్గించడంతో , కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ అలాగే ఫ్లిప్ కార్ట్  లో పలు ఆఫర్లు ప్రకటించడం గమనార్హం.. ఇక ఈ ఐఫోన్ 12 సిరీస్ పై కస్టమర్లను ఆకర్షించడానికి  అమెజాన్ తోపాటు ఫ్లిప్కార్ట్ కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ లను కూడా ప్రకటించాయి.. అంటే ఒకవేళ ఫ్లిప్ కార్ట్ లేదా అమెజాన్ లో ఐ ఫోన్ 12 స్మార్ట్ ఫోన్ ( వనిల్లా)  ధర ప్రస్తుతం రూ. 63,999 కి కొనుగోలు చేయవచ్చు. 64 జిబి వేరియంట్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ గతేడాది రూ.79,900 ఉండగా , ఇప్పుడు రూ. 15,901 రూపాయలు డిస్కౌంట్ తో మనకు రూ.63,999 కే లభించనుంది..

ఇక ఇదే మొబైల్ 128 జీబీ వేరియంట్ తో గతేడాది రూ.84,900 ఉండగా , ప్రస్తుతం దీనిని రూ.68,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ పైన కూడా మనం 15,901 రూపాయలను ఆదా చేసుకోవచ్చు అన్నమాట.

256 జీబీ వేరియంట్ తో వచ్చిన ఈ మొబైల్  ప్రస్తుతం రూ.78,999 కే లభించనుంది. అంతేకాదు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్స్చేంజ్ లో భాగంగా 14,200 రూపాయలను అమెజాన్ అందిస్తుంటే ,15 వేల రూపాయలను ఫ్లిప్ కార్డ్ ఎక్స్చేంజ్ కింద  తగ్గిస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: