మన దేశంలోనే ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ సైకిల్ హవానే బాగానే కొనసాగుతోంది. దీంతో తమ తమ కంపెనీలు వాటి ఉత్పత్తులను బాగా అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. "నెక్స్ జు మొబిలిటీ"అనే సంస్థ ఒక సరికొత్త సైకిల్ ను మార్కెట్ లో తాజాగా విడుదల చేసింది. మన ఇంట్లో అవసరాల కోసం.. ఏదైనా దూరం కి వెళ్లేటప్పుడు సైకిల్ బాగా ఉపయోగపడుతుందని ఆ సంస్థ తెలిపింది.


సైకిల్ తొక్కడానికి ఫ్రీ గా ఉంటుంది, మరియు ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు..100 కిలోమీటర్ల వరకు వెళుతుంది. ముఖ్యంగా దీనిని ఎక్కువసేపు తొక్కవలసిన అవసరం కూడా లేదట. ఇందులో నాలుగు రకాలుగా ఎలక్ట్రిక్ మోడల్స్ కలిగిన సైకిల్ ను అందుబాటులో ఉంచింది. ఈ సైకిల్ 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ  ప్రయాణిస్తుంది. ఇందులో 250w ఎలక్ట్రిక్ మోటార్ తో అమర్చబడి ఉంటుంది. ఈ సైకిల్ కి రెండు డిస్క్ బ్రేక్ లు కూడా కలవు. దీని ధర ప్రస్తుతం 44,000 రూపాయలు . ఈ ROADLAEK సైకిల్ ఫుల్ చార్జింగ్ కావాలంటే.. 4:00 గంటల సమయం పడుతుందట.

సైకిల్ కి ఉన్న స్టీల్ ఫ్రేమ్ చాలా మందంతో స్ట్రాంగ్ గా ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. ముఖ్యంగా సరుకులు, ఏదైనా బరువైన వస్తువులను కూడా మోయగలదు అని తెలిపింది.ఇందులో ఒక ప్రత్యేకమైన సదుపాయం కూడా ఉన్నది.. అదేమిటంటే ఛార్జింగ్ అయిపోయిన వెంటనే, మనం మన గమ్యానికి చేరుకోవడానికి పెడల్స్ తో వెళ్ళడానికి సులువుగా ఉంటుంది. వీటికి ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి అవసరం లేదని ఆ సంస్థ తెలిపింది.

దీనిని మీరు కొనాలనుకుంటే కేవలం..https://nexzu.in.. అనే వెబ్ సైట్ లో తీసుకోవాలి. ఇది ముఖ్యంగా చెన్నై, మధురై, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్. వంటి నగరాలలో దొరుకుతున్న ట్లుగా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: