ఇండియాలో జియో, ఎయిర్ టెల్ వంటి టెలిగ్రామ్ ఆపరేటింగ్స్ 5g నెట్వర్క్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.. దీంతో పలు బ్రాండెడ్ నుంచి కంపెనీ మొబైల్స్ కూడా విడుదల చేస్తున్నాయి. వన్ ప్లస్ స్మార్ట్ మొబైల్ మాత్రం 11-5G స్మార్ట్ మొబైల్ మరికొన్ని రోజుల్లో ఇండియాలోకి వచ్చేస్తోంది. ఐఫోన్ తర్వాత మళ్లీ అంతటి క్రేజీ కలిగి ఉన్న బ్రాండ్ మొబైల్స్ వల్ల వన్ ప్లస్ అని చెప్పవచ్చు ఈ స్మార్ట్ మొబైల్ ఫిబ్రవరి 7వ తేదీన ఇండియాలో లాంచ్ కాబోతోంది. ఇక ఈ మొబైల్ ధర ఫీచర్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం.


One plus -11-5G:
వన్ ప్లస్ 11-5G మొబైల్ 8gb ర్యామ్ తో పాటు 128 GB స్టోరేజ్ తో లభిస్తుంది ఈ మొబైల్ సుమారుగా రూ.35 నుంచి రూ.40 వేల మధ్య ఉంటుందని అంచనా. ఈ వివరాలు విడుదల రోజు అధికారికంగా ప్రకటించనున్నాయి. వన్ ప్లస్ 11-5G స్మార్ట్ మొబైల్ డిస్ప్లే పరంగా చూస్తే..3216X1440 ఫిక్సెల్ తో కలదు.6.7 అంగుళాల కూల్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ పరంగా చూసినట్లు అయితే.. బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరా సెట్ అప్ తో కలదు.


ప్రైమరీ కెమెరా 50 మెగా ఫిక్సెల్ తో ఉంటుంది..48 మెగాపిక్ సెల్ లెన్స్ తో సోనీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కలదు.. అంతేకాకుండా చాలా రకాల ఫీచర్స్ కూడా ఈ మొబైల్లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ 11-5G మొబైల్ బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యం గల బ్యాటరీతో..100 W ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మొబైల్ కు సంబంధించి కస్టమర్లు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వన్ ప్లస్ బ్రాండెడ్ నుంచి ఈ మొబైల్ రావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: