ఏదైనా ఫెస్టివల్ సీజన్ వస్తొందంటే చాలు కచ్చితంగా పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ల పైన వెహికల్స్ పైన పలు రకాల ఆఫర్లను సైతం ప్రకటిస్తూ ఉంటారు.. ఇప్పుడు తాజాగా ఫెస్టివల్స్ సందర్భంగా కోమాకి తన LY ఎలక్ట్రిక్ స్కూటర్ పైన భారీగా 21 వేల రూపాయల ధరను తగ్గించి కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ అసలు ధర రూ.1,34,999 రూపాయలు కలదు. ఇప్పుడు ఆఫర్ కింద రూ.1,13,999 రూపాయలకి కొనుగోలు చేసే విధంగా ఆఫర్లను ప్రకటించింది. ఈ తగ్గింపు దీపావళి వరకు ఇండియా మొత్తం అందుబాటులో కలదు.
కోమకి LY  ఎలక్ట్రిక్ స్కూటర్లో రెండు బ్యాటరీలు కలవు వీటిని ఎక్కడికైనా మనం తీసుకు వెళ్ళవచ్చట.. ఒక్కొక్క బ్యాటరీ పూర్తి ఛార్జింగ్ కావడానికి సుమారుగా ఐదు గంటల సమయం కంటే తక్కువగా పడుతుందట. అన్ బోర్డ్ నావిగేషన్, బ్లూటూత్ కాలింగ్, సౌండ్ సిస్టమ్ వంటివి కలవు.. అలాగే TFT స్క్రీన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మూడు గేర్ మోడ్ లు ఉంటాయట. టర్బో ఎల్ఈడి ఫ్రెంట్ వింకర్లు..3000 W అబ్ మోటర్ పార్కింగ్ అసిస్టెంట్ హూ ఇస్ కంట్రోల్ రివర్స్ అసిస్టెంట్ ఇతర ఫీచర్స్ సైతం ఇందులో కలిగి ఉన్నాయట.


రెండు బ్యాటరీలు కలిపి స్కూటర్  చార్జింగ్ చేసినట్లు అయితే.. 200 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. ఒక్కో బ్యాటరీ 85 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కొమాకి గరిష్ట వేగం 55 నుంచి 60 KM వేగంతో ప్రయాణిస్తుంది. ఏడాది ఆగస్టు నెలలో ఈ బైక్ కు సంబంధించి భద్రత ఫీచర్స్ అదనపు వాటిని అప్గ్రేట్ చేసిందట. ఇవి కూడా అగ్ని నిరోధకతను కలిగి ఉంటుంది. కేవలం నాలుగు గంటలలోనే 90 శాతం వరకు చార్జింగ్ను చేయగలవు. ఎవరైతే ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి ఈ బైక్ ఒక చక్కటి అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి: