ప్రస్తుతం ఎవరి దగ్గరకైనా వెళ్లి మొబైల్ లేని జీవితాన్ని ఊహించుకోగలరా అనే ప్రశ్న అడిగితే.. కాసేపు ఆలోచిస్తారు. ఇక ఆ కాసేపు ఆలోచనలోనే మొబైల్ లేని జీవితం ఎంతో నరకప్రాయంగా ఉంటుంది అనే భావన వాళ్లకి కలుగుతూ ఉంటుంది. మొబైల్ లేకుండా జీవితం అస్సలు ఊహించుకోలేం బాసు అని సమాధానం చెబుతారు ప్రతి ఒక్కరు. అంతలా మొబైల్ కి మనిషి ఎడిక్ట్ అయిపోయాడు అని చెప్పాలి.  కేవలం మనిషి అవసరాలను తీర్చడానికి సుదూర ప్రాంతాలలో ఉన్న వ్యక్తులతో కమ్యూనికేషన్ చేయడానికి మాత్రమే అందుబాటులోకి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు ఏకంగా మనిషినే బానిసగా మార్చేసింది.


 ఏకంగా ఆరు అంగుళాల మొబైల్ ఆరడుగుల మనిషిని ఆడిస్తుంది. ఇటీవల కాలంలో ఒక్కరోజు కాదు కాదు కనీసం ఒక గంట కూడా మొబైల్ చూడకుండా ఉండగలిగే మనిషి ఎవ్వరు కనిపించరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అధునాతన టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్న నేపద్యంలో మనిషి మరింత ఎక్కువగా మొబైల్ కి బానిసగా మారిపోతున్నాడు. అది సరే కానీ ఇప్పుడు మొబైల్ గురించి ఎందుకు చర్చ వచ్చింది అంటారా.. అయితే మొబైల్ వాడటమే కాదు దానికి చార్జింగ్ పెట్టడం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు.


 సాదరణంగా చాలామంది నైట్ పడుకునేటప్పుడు చార్జింగ్ పెట్టేసి అలాగే ఉదయం వరకు ఉంచేస్తారు. ఇక ఉదయం లేచేసరికి ఎలాగో 100% చార్జ్ అవుతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా కేవలం ముందుగా సెట్ చేసిన విధంగా కొన్ని సార్లు మాత్రమే వందసార్లు వరకు చార్జ్ అవుతుందట. సాధారణంగా ఫోన్ బ్యాటరీలు 300 నుంచి 500 సార్లు పూర్తిగా 100% ఛార్జ్ అయ్యేలా కంపెనీలు తయారుచేస్తాయి. ఆ పరిమితి దాటితే బ్యాటరీల పనితీరు పూర్తిగా క్షీణిస్తూ ఉంటుందట. అందుకే ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు 20% నుండి 80% మధ్య ఉండేలా మెయింటైన్ చేస్తే బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా చార్జింగ్ పెట్టి అలాగే వదిలేయడం అసలు మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: