వాహనాలు ఉన్న ఓనర్స్ కి సైతం టైరు పంచర్ అనేవి ఎక్కడైనా ఎప్పుడైనా సరే సాధారణంగా సంభవిస్తూనే ఉంటాయి.. దీనివల్ల టైర్ల నుంచి గాలి విడుదలవుతుంది దానిని రిపేర్ చేయకుండా ముందుకు వెళ్లడం చాలా కష్టమే.. కొన్నిసార్లు పంచరైన టైర్లతో ప్రయాణిస్తే ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులలో టైరు పంచర్ సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా టైర్ ప్రొటెక్షన్ లిక్విడ్ అనేది పంచర్ను నివారించడంలో చాలా సహాయపడేటువంటి కొత్త పద్ధతిని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఇది టైర్ లోపల పోసేటువంటి ఒక ప్రత్యేకమైన ద్రవం అన్నట్టుగా తెలుపుతున్నారు.


టైర్లలో పంచర్ ఆయినప్పుడు ఈ ద్రవాన్ని నింపడం వల్ల పంచర్ ను నయం చేస్తుంది. దీని ద్వారా కార్ల టైర్లు సులభంగా మనం ఉపయోగించుకొనే వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా టైరు జీవితాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది.. మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ షాపింగ్ మాల్స్ లో టైర్ ప్రొటెక్షన్ లిక్విడ్ ని మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఇది చాలా చౌక ధరకే లభిస్తుంది కేవలం రూ .300 రూపాయలు ఖర్చు చేయడం ద్వారా మీకు టైర్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు.


టైర్ ప్రొటెక్షన్ లిక్విడ్ పంచరైన టైర్లను రిపేర్ చేస్తుంది. ఈ ద్రవాన్ని టైర్ లోపల పోసారంటే చాలు టైరు తిరిగేటప్పుడు టైరు లోపల కూడా తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల టైర్ కి పంచారైనాచోట ఈ ద్రవం పూడుస్తూ వెళ్తుంది.. దీనివల్ల గాలి బయటికి రాలేక ఉంటుంది.


ఇది ఎక్కువగా గతుకుల రోడ్ల పైన నడిచే వాహనాలకు బాగా ఉపయోగపడుతుంది.


పంచర్ అయినప్పుడు టైర్లు రిపేర్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.. కానీ ఈ లిక్విడ్ వల్ల పంచర్ని నిరోధిస్తుంది.. దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. దీంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. అలాగే టైరు పంచర్ వల్ల ప్రమాదాన్ని సైతం నివారించడానికి ఈ ద్రవం ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: