టీడీపీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం బాపట్ల. అయితే, ఇక్కడ ఆ పార్టీకి గత రెండు దశాబ్దాల్లో పెద్దగా బూమ్ లేదు. ఎవరూ పట్టించుకున్న నాయకుడు కూడా లేరు. ఎవరికి వారు తమ తమ స్వార్థ రాజకీయాలు చేసుకుని పబ్బం గడుపుకొన్నవారే! పార్టీని వినియోగించుకుని పైకి వచ్చిన వారే.. రెండు దశాబ్దాల పాటు ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కోన్న టీడీపీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విపత్కర పరిస్థితుల్లో ఉన్నా బాపట్లలో మాత్రం ఉరుకులు పరుగులు పెడుతోంది.. కాదు నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో సైకిల్ ఇక్కడ దూసుకు పోతోంది. నరేంద్ర వర్మ. అన్ని వర్గాల వారినీ కలుపుకొని పోతున్నారు. ప్రతి ఒక్కరికీ చేరువ అవుతున్నారు. దీంతో ఆయన పేరు ఇప్పుడు గుంటూరు జిల్లా టీడీపీ వర్గాల్లో మార్మోగుతోంది.
వాస్తవానికి టీడీపీ ఆవిర్భవించిన తర్వాత.. అనేక మంది నాయకులు బాపట్లలో పార్టీ జెండా మోశారు. 1985లో అంటే పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే టీడీపీ తరఫున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు) ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే, ఈయన కూడా పార్టీకి పునాదులు వేసిందేమీ లేదు. ఇక, తర్వాత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. 1994లో శేషగిరిరావు గెలుపు గుర్రం ఎక్కారు. ఈయన కొంత మేరకు పార్టీ కోసం కృషి చేశారు. ఈ క్రమంలోనే తర్వాత 1999లో మంతెన అనంతవర్మ.. టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇక, ఆయన తర్వాత కూడా.. పార్టీ పెద్దగా దూకుడు ప్రదర్శించలేక పోయింది. చివరగా అంటే 1999లో మాత్రమే ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీకి సరైన నాయకుడు లేడు.. పార్టీ గెలిచిందీ లేదు.
2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గాదె వెంకట రెడ్డి విజయం సాధించారు. 2009లో చీరాల గోవర్ధన్‌కు టీడీపీ ఛాన్స్ ఇచ్చింది. అయితే, ఆయన పార్టీని డెవలప్ చేయడంలో విఫలమయ్యారు. ఇక, 2014 సమయంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చి టీడీపీ కండువా కప్పుకొన్న అన్నం సతీష్ (సుజానా చౌదరి శిష్యుడని ప్రచారంలో ఉంది). టికెట్ దక్కించుకున్నారు. కానీ, ఆయన పార్టీని పరుగులు పెట్టించడంలో విఫలమై.. పార్టీని, తనను కూడా ఓడించుకున్నారు. అయి నప్పటికీ.. సుజనా ఒత్తిడితో.. సతీష్‌కు చంద్రబాబు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు పోనీ.. ఇలా అయినా.. పార్టీని డెవలప్ చేస్తారని అనుకున్నారు. కానీ, ఆయన తన వ్యాపారాలు.. వ్యవహారాల వరకే పరిమితమయ్యారు.
అయితే, ఆ సమయంలోనే పార్టీలోకి వచ్చిన వేగేశన నరేంద్ర వర్మ.. తనదైన శైలిలో పార్టీ కోసం కృషి చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ఆయనకు నియోజకవర్గంలో ఎలాంటి పదవీ లేకపోయినా కూడా పార్టీని ముందుకు తీసుకు వెళ్లడంతో పాటు అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లారు. 2019 ఎన్నికల్లో టికెట్ కోసం ఆయన ప్రయత్నిస్తూనే.. పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. అయితే, చివరినిముషంలో సుజనా లాబీయింగ్ కారణంగా.. నరేంద్ర వర్మకు ఛాన్స్ మిస్సయింది. ఇంతలో.. గాదె వెంకట రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కూడా తన కుమా రుడి కోసం.. టికెట్ ఆశించారే తప్ప.. పార్టీ కోసం కృషి చేసింది ఏమీ కనిపించలేదు. ఇటీవల ఈయన వైసీపీలో చేరిపోయారు.
ఇక, అన్నం సతీష్ ఏకంగా చంద్రబాబును తిట్టిపోసి మరీ.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. బీజేపీ కండువా కప్పేసుకున్నారు. ఇక, అంతిమంగా బాపట్లలో టీడీపీ జెండా ఎవరబ్బా మోసింది.. మోస్తోంది.. అనే విషయాన్ని పరిశీలిస్తే.. వేగేశ్న నరేంద్ర వర్మ ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచే క్షేత్రస్థాయిలో జెండా కర్ర భుజాన వేసుకుని, ఇంటింటికీ తిరిగారు. నియోజకవర్గంలో పేదలకు అన్ని విధాలా సాయం చేశారు. తనసంస్థల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఖర్చుపెట్టి.. స్వచ్ఛంద సేవలు చేశారు. వాటర్ ట్యాంకుల పంపిణీ ద్వారా లక్షల మందికి నీరు అందించా రు. నిత్యవసరాలను అందించారు.
ప్రభుత్వ పథకాలపై ఇంటింటికీ తిరుగుతూ.. ప్రత్యర్థుల నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా భరించారు. తన అంతిమ లక్ష్యం పార్టీ డెవలప్‌మెంటేనని చెప్పుకొచ్చారు. అలాంటి నాయకుడికి ఎన్నికల్లో టికెట్ వస్తుందని అందరూ ఆశించారు. కానీ, చివరి నిముషంలో మళ్లీ సతీషే దక్కించుకున్నారు. అయినప్పటికీ నరేంద్ర వర్మ వెనక్కి తగ్గలేదు. పార్టీకో సం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల అనంతరం, అది కూడా అన్నం సతీష్ పలాయనం చిత్తగించిన తర్వాత.. టీడీపీ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతలు చేపట్టి.. స్వల్ప కాలమే అయినా.. నరేంద్ర వర్మ.. దూకుడు ఓ రేంజ్‌లో కొనసాగిస్తున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర వర్మ.. స్వశక్తితో ఎదిగారు.
అదే సమయంలో రాజకీయంగా ఆయనకు. ఎమ్మెల్యే అవ్వాలని... బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న సేవాకార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న తీరు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వినిపిస్తున్న గళం వంటివి ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి. ఇప్పటికైతే.. ఆయన విజేతే!! ఎన్నికలను పక్కన పెడితే.. ప్రజల మనసులను గెలుచుకున్నారు.. విజేత అయ్యారు. ఇక్కడ నుంచి డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి ఉన్నప్పటికీ.. ఆయనకన్నాకూడా.. ఇప్పుడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. ముందు గుర్తుకు వస్తున్న పేరు.. నరేంద్ర వర్మ.. క్యూకడుతున్న ఇల్లు.. నరేంద్ర వర్మ ఇల్లే..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి