కరోనా సెకండ్ వేవ్ ప్రపంచమంతటా చాలా ఘోరంగా ఇంకా వేగంగా విజ్రుంభిస్తుంది. అలాగే దేశంలో కూడా చాలా దారుణంగా కరోనా విలయతాండవం చేస్తుంది. దేశం అంతటా వ్యాపించి కొన్ని వేలాది కుటుంబాలని పొట్టనబెట్టుకొని బలి తీసుకుంటుంది.కరోనా కేసులు రోజు రోజుకి చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇక ఎక్కడ చూసిన కరోనా కేసులు మితి మీరిపోతున్నాయి. రోజు రోజుకి ఈ మహమ్మారీ చాప కింద నీరుల వ్యాపిస్తూనే వుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇక మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదవుతుంది. రోజు రోజుకి దేశంలో పరిస్థితి చాలా దారుణంగా తయారువుతుంది.ఏం చెయ్యాలో తెలీక అటు ప్రభుత్వాధికారులు,ఇటు డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.అంతలా విరుచుకుపడుతుంది ఈ మహమ్మారి.కేసులు మితిమీరిపోతున్నాయి. ఇక అలాగే ఆక్సిజన్ కొరత కూడా చాలా ఎక్కువగా వుంది.ముఖ్యంగా మహా రాష్ట్రలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ఇక దేశంలో రోజు రోజుకు కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక చర్యలు చేపట్టింది. నగరంలో అంబులెన్సుల కొరతను తీర్చేందుకు మినీ బస్సులను అంబులెన్సులుగా మార్చేసింది. మొత్తం 25 మినీ బస్సు అంబులెన్సులను కోవిడ్ బాధితులకు అందుబాటులోకి తెచ్చింది. కరోనాతో బాధపడుతున్న రోగులు ఇప్పటివరకు ప్రైవేట్ అంబులెన్సుల్లోనే హాస్పిటళ్లకు చేరుతున్నారు. దీన్ని సొమ్ము చేసుకొనేందుకు అంబులెన్సు నిర్వాహకులు భారీగా నగదు వసూలు చేస్తున్నారు. దీంతో అధికారులు మినీ బస్సులనే అంబులెన్సులుగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే మినీ బస్సుల్లో సీట్లను తొలగించి వైరస్ బాధితులకు అవసరమైన సదుపాయాలను కల్పించారు. ప్రతి బస్సులోను ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్సు సేవలు అందుకొనేందుకు ప్రత్యేక హెల్స్‌లైన్ నెంబరు 0712 2551417 అందుబాటులోకి తెచ్చారు. బాధితులు ఈ నెంబరుకు కాల్ చేస్తే చాలు మినీ బస్సు అంబులెన్సులు ఇళ్లకు చేరుకుంటాయని అధికారులు తెలిపడం జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: