2019లో వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 50 ఇళ్లకు ఒక వాలంటరీని నియమించారు. వీరితోనే ప్రజలకు కావలసిన పనులన్నీ చేయించేవారు. 2024 ఎన్నికల సమయంలో వాలంటరీ వ్యవస్థ చాలా కీలకంగా ఎన్నికలలో ఉంటుందని భావించినప్పటికీ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాలంటరీల జీతం పెంచుతామంటూ చెప్పడంతో కూటమి ప్రభుత్వం వైపే మక్కువ చూపారు. అంతేకాకుండా వైసిపి పార్టీ 2024 ఎన్నికలలో గోరంగా ఓడిపోయి 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో చాలామంది వాలంటరీ వ్యవస్థ వల్లే తామ ప్రజలకు దూరమయ్యామని అందుకే ఓడిపోయామంటూ చెప్పుకొచ్చారు నేతలు.


 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను రద్దుచేసింది. అయితే వైసిపి 2029 ఎన్నికలలో గెలిచిన వాలంటరీ వ్యవస్థ ఉండదంటూ తాజాగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ వల్లే తాము ప్రజలకు దూరమయ్యామని ఈ వ్యవస్థను నమ్ముకొని తాము మోసపోయామంటూ బహిరంగంగానే తెలియజేశారు. ఈ వాలంటరీ వ్యవస్థ తమ రాజకీయ భవిష్యత్తును చాలా దెబ్బతీసిందని తీవ్రస్థాయిలో అసంతృప్తిని తెలిపారు. వాలంటరీ వ్యవస్థ పై ఆధారపడి ప్రజలకు పూర్తి న్యాయం చేయలేకపోయామంటూ ఎమ్మెల్యే అంగీకరించారు.


వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలు, నాయకుల మధ్య చాలా దూరం పెరిగిపోయిందని భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాలంటరీ వ్యవస్థను మళ్ళీ తీసుకువచ్చే అవకాశం ఉండదంటూ క్లారిటీగా తెలియజేశారు. అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు కార్యకర్తల దగ్గర ఫోటోలు దిగేందుకు కూడా సమయం దొరకడం లేదని, ఈసారైనా కార్యకర్తలను నిరాశపరచకుండా వారికోసం ప్రత్యేకించి సమయాన్ని కేటాయించాలని కోరారు. రాబోయే ఎన్నికలలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం 2.o వ్యవస్థను అమలు చేసి తీరుతామని తమను ఇబ్బంది పెట్టిన అధికారుల పైన చర్యలు తీసుకుంటామంటూ  ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హెచ్చరించారు. వాలంటరీ వ్యవస్థ పై మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: