ఈ సినిమా కేవలం రేసింగ్ గురించి మాత్రమే కాదు, ఒక కుటుంబంలోని మూడు తరాల భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. తండ్రి పాత్రలో శర్వానంద్ 90వ దశకంలో ఒక పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తారట. ఆ కాలంలో మోటోక్రాస్ రేసింగ్ ఎలా ఉండేది, ఆ తండ్రి ఆశయాలు ఏంటి అనేవి చాలా ఇంటెన్స్‌గా ఉంటాయని సమాచారం.కొడుకు పాత్రలో శర్వానంద్ ఆధునిక బైక్ రేసర్‌గా, స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారు.సూర్య 'వారణం ఆయిరం' (సూర్య సన్నాఫ్ కృష్ణ) రేంజ్‌లో ఈ తండ్రీకొడుకుల ట్రాక్ ఉండబోతోందని శర్వానంద్ హింట్ ఇవ్వడం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఈ సినిమాలో సీనియర్ హీరో డా. రాజశేఖర్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. శర్వానంద్ తండ్రి పాత్రకు సపోర్టింగ్ గా లేదా ఒక మెంటార్‌గా ఆయన కనిపిస్తారని టాక్. రాజశేఖర్ మార్క్ గంభీరమైన నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. రాజశేఖర్, శర్వానంద్ కాంబినేషన్ అనగానే సినిమాకు ఒక ప్రత్యేకమైన వెయిట్ వచ్చేసింది.టాలీవుడ్‌లో ఇప్పటివరకు బైక్ రేసింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అందులోనూ 'బైకర్' చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో 3D మరియు 4DX ఫార్మాట్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.మట్టిలో బైక్ రేసింగ్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు థియేటర్లలో సీట్ల నుంచి గాలిలోకి ఎగిరిన అనుభూతి కలుగుతుందట.గిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జె యువరాజ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని యూనిట్ చెబుతోంది.
నిజానికి ఈ సినిమా 2025 డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, 3D పనులు మరియు పెండింగ్ వర్క్స్ వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో వస్తున్న శర్వా, ఆ వెంటనే సమ్మర్ కానుకగా ఈ 'బైకర్' ను దించే ప్లాన్ లో ఉన్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను ఏమాత్రం రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది.శర్వానంద్ తన కెరీర్‌లో చేస్తున్న ఈ 'డబుల్ రోల్' ప్రయోగం ఆయనకు పక్కాగా మాస్ ఇమేజ్ తెచ్చిపెడుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. తండ్రిగా గంభీరంగా, కొడుకుగా స్టైలిష్‌గా శర్వానంద్ చేసే ఈ బైక్ రేసింగ్ విన్యాసాలు బాక్సాఫీస్ వద్ద స్పీడ్ రికార్డులు సృష్టించడం ఖాయం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి