ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియకపోయినా, ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఇది విపరీతంగా ట్రెండ్ అవుతూ వైరల్‌గా మారింది. టాలీవుడ్‌లో యంగ్ సెన్సేషన్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన హీరోయిన్ రష్మిక మందన పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ వార్తలకు అధికారిక ధృవీకరణ లేకపోయినా, ఫ్యాన్స్ మాత్రం ఈ జంట గురించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఊహాగానాలు చేసుకుంటూ ఉంటున్నారు.ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో మరింత హీట్ పెంచుతోంది. అదేంటంటే… విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లికి ముందే అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేశారట అనే ప్రచారం. అయితే ఇది సాధారణంగా వినిపించే ఏదైనా తప్పు అగ్రిమెంట్ గురించి కాదు. పెళ్లి అనంతరం వీరిద్దరూ కలిసి చేయబోయే తొలి సినిమా ప్రాజెక్ట్‌కు సంబంధించిన అగ్రిమెంట్‌పై ముందుగానే సైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాకు శివ నిర్మాణ దర్శకత్వం వహించనున్నారనే వార్త కూడా జతకలిసింది.

ఈ న్యూస్ బయటకు రావడంతో విజయ్–రష్మిక ఫ్యాన్స్ ఫుల్ సర్ప్రైజ్‌కు గురవుతున్నారు. కొంతమంది మాత్రం ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తుండగా, మరికొంతమంది మాత్రం వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి ఇలా జరిగితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. నిజానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అయినా సరే, వీరిద్దరి పేర్లు కలిపి వచ్చే ప్రతి వార్త కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది.ఇక మరోవైపు, ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండరష్మిక మందన పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీనికి కారణం ఇటీవల రష్మిక మందన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “నా పెళ్లి గురించి ఏదైనా నిజమైన విషయం ఉంటే నేనే స్వయంగా బయటకు వచ్చి చెబుతాను” అని చాలా ఓపెన్‌గా చెప్పింది. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

కొంతమంది నెటిజన్లు మాత్రం, నిజంగానే పెళ్లి దగ్గరలో ఉంటే ఇలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? లేకపోతే ఎందుకు ఇలా మాట్లాడింది? అనే ప్రశ్నలు వేస్తున్నారు. మరికొందరు అయితే, ఇదంతా కావాలనే క్లారిటీ ఇవ్వకుండా మిస్టరీగా ఉంచేందుకే చేసిన వ్యాఖ్యలుగా భావిస్తున్నారు. ఏది ఏమైనా, రష్మిక మాటల తర్వాత ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరిందనే చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లకు సంబంధించిన ఇలాంటి వార్తలు కొత్తేమీ కాకపోయినా, విజయ్ దేవరకొండరష్మిక మందన జంటకు సంబంధించిన వార్తలకు మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సినిమా పరంగా అయినా, వ్యక్తిగత జీవితం పరంగా అయినా వీరి ప్రతి చిన్న విషయాన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఫాలో అవుతుంటారు. అందుకే, ఈ అగ్రిమెంట్ న్యూస్ అయినా, పెళ్లి డేట్ ప్రచారం అయినా సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.

అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై విజయ్ దేవరకొండ గానీ, రష్మిక మందన గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఇవన్నీ కేవలం సోషల్ మీడియా టాక్స్‌, ఊహాగానాలే కావచ్చని చెప్పుకోవాలి. నిజం ఏంటన్నది మాత్రం వాళ్లిద్దరూ స్వయంగా బయటకు వచ్చి చెప్పేవరకు తెలియదు. అప్పటివరకు ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హీట్ పెంచుతూనే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: