ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టే చాలామంది నటులు మొదటినుంచే హీరోగానే స్థిరపడాలని కలలు కంటారు. సైడ్ ఆర్టిస్టుగా చేస్తే వచ్చే గుర్తింపు ఒక రకమైతే, హీరోగా నటిస్తే వచ్చే క్రేజ్, ఫాలోయింగ్ మాత్రం పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా ఒకసారి హీరోగా తమకంటూ ఓ ఇమేజ్‌ను, మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాక.. కెరీర్‌లో కొంతకాలం అటూ ఇటూ అయినా..వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. వరుసగా కొన్ని ప్లాప్స్ వచ్చినా “ఎప్పుడో ఒకసారి హిట్ పడుతుంది” అన్న నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగుతారు.

అయితే మాస్ మహారాజా రవితేజ విషయంలో ఈ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందనే చెప్పాలి. ఒకప్పుడు వరుస హిట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రవితేజ, గత కొంతకాలంగా ఎంత కష్టపడినా సరే సరైన హిట్‌ను అందుకోలేకపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయం మాత్రం ఆయనను పలకరించడం లేదు. చివరిసారిగా ఆయన కెరీర్‌లో పెద్ద హిట్ వచ్చి చాలా కాలమే అయింది అనే మాట ఇప్పుడు అభిమానుల మధ్య కూడా వినిపిస్తోంది.ఈ పరిస్థితుల్లో రవితేజ ఎక్కువగా నమ్ముకున్న డైరెక్టర్లు కూడా కథలను చివరి నిమిషంలో మార్చడం, స్క్రిప్ట్‌లపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు కథ ఎంపికలో చాలా స్ట్రాంగ్‌గా ఉన్న రవితేజ, ఇప్పుడు సరైన బ్రేక్ కోసం కొత్త ఆలోచనల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఇలాంటి సమయంలోనే రవితేజకు సంబంధించిన ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలాగైనా సరే ఈసారి హిట్ కొట్టాలనే బలమైన నిర్ణయంతో, రవితేజ ఓ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో చాలా అరుదుగా కనిపించిన నెగిటివ్ పాత్రలో నటించేందుకు ఆయన ఆలోచిస్తున్నారట. అంతేకాదు, ఓ బిగ్ స్టార్ హీరో సినిమాలో రవితేజకు నెగిటివ్ క్యారెక్టర్ చేసే ఆఫర్ వచ్చిందని, ఆ పాత్రకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే—ఆ బిగ్ స్టార్ హీరోతో రవితేజ గతంలో కలిసి నటించిన సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అదే హీరో సినిమాలో ఇప్పుడు నెగిటివ్ పాత్రలో కనిపించేందుకు రవితేజ ఒప్పుకోవడం అభిమానులకు ఊహించని షాక్‌లా మారింది. ఒకప్పుడు సమానంగా హీరోలుగా స్క్రీన్ షేర్ చేసుకున్న నటుడు, ఇప్పుడు విలన్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడన్న వార్త ఫ్యాన్స్‌ను ఆలోచనలో పడేసింది.

అయితే ఇదే రవితేజ కెరీర్‌కు కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుందా? లేక మరో రిస్క్‌గా మారుతుందా? అన్నది చూడాలి. ఏదేమైనా, మాస్ మహారాజా ఈసారి మాత్రం ఏదైనా కొత్తగా చేసి మళ్లీ తన సత్తా చాటాలని గట్టిగానే డిసైడ్ అయినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: