సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎప్పుడూ ఏదో ఒక కారణంతో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోగా తారక్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేనంత పెద్దది. అదే సమయంలో, అంతే స్థాయిలో నెగిటివ్ ట్రోలింగ్ కూడా ఆయనను వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ నెగిటివిటీ మరింత ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్పాలి.వార్ 2 సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అట్టర్ ఫ్లాప్‌గా మారడంతో, జూనియర్ ఎన్టీఆర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌లో చేయాల్సిన మరో ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్ కూడా మధ్యలో ఆగిపోవడం తారక్ ఇమేజ్‌పై మరింత ప్రభావం చూపింది. దీంతో ఆయనపై ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ కొంతవరకు తగ్గిపోయిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం తారక్ - ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక మరో భారీ ప్రిస్టీజియస్  మూవీకి రెడీ అవుతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలోనే తారక్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయనలో ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్‌నే ప్రస్తుతం ఎదురవుతున్న ట్రోలింగ్‌కు ప్రధాన కారణంగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఫ్యాన్స్ చెప్పుకుంటున్న దాని ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ చాలా ఈజీగా ఇతరులను నమ్మేస్తాడట. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేసి, వాళ్లు తీసుకొచ్చిన స్క్రిప్ట్‌కి వెంటనే కమిట్ అయిపోతాడని, అది తనకు పూర్తిగా నచ్చకపోయినా కూడా ఫ్రెండ్షిప్ అనే మాయలో పడిపోయి ఒప్పుకుంటాడని అంటున్నారు. ఇదే తారక్‌లో ఉన్న పెద్ద బలహీనత అని, ఈ కారణంగానే చుట్టూ ఉన్నవాళ్లు ఆయనను సులభంగా మోసం చేయగలుగుతారని అభిమానులు బాధపడుతున్నారు.

వార్ 2 విషయంలో కూడా ఇదే జరిగింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో తన పాత్రకు పెద్దగా ఎఫెక్ట్ లేకపోయినా, కథలో బలమైన ప్రాధాన్యం కనిపించకపోయినా, ఫ్రెండ్షిప్ కారణంగానే తారక్ ఆ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఫలితంగా సినిమా ఫెయిల్ అయ్యింది, దాంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది చూసి నిజమైన అభిమానులు ఎంతో బాధపడుతున్నారు.“ఒకవేళ తారక్ ఈ ఫ్రెండ్షిప్ మాయలో పడకుండా, ప్రతి స్క్రిప్ట్‌ను కూల్‌గా విశ్లేషించి నిర్ణయం తీసుకుంటే, ఈపాటికి ఆయన కెరీర్ మరో స్థాయిలో ఉండేది” అని చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. ఆయనలోని నటనా ప్రతిభకు, డ్యాన్స్‌కు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఎలాంటి లోటు లేదని, కానీ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే సమస్యగా మారిందని అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పటికైనా తారక్ తన గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. రాబోయే ప్రాజెక్ట్స్‌తో మళ్లీ తన స్థానం తిరిగి సంపాదించి, ట్రోలింగ్‌కు గట్టి సమాధానం ఇస్తాడనే నమ్మకం వారిలో కనిపిస్తోంది. తారక్ లాంటి టాలెంటెడ్ యాక్టర్‌కు ఇది తాత్కాలిక దశ మాత్రమే అని, త్వరలోనే మళ్లీ తన సత్తా చూపిస్తాడని ఫ్యాన్స్ బలంగా విశ్వసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: