దేవి శ్రీ ప్రసాద్ కోసం సుమారుగా 8 గంటల పాటు ఈ సినిమా కథను వివరించారట డైరెక్టర్ వేణు. ఇందులో ఇంటెన్సిటీ నచ్చి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కూడా అందరిని ఆకట్టుకుంది. ఇందులో దేవిశ్రీప్రసాద్ పర్శి అనే ఒక మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేమిటంటే ఇందులో రెగ్యులర్ హీరోయిన్ అంటూ ఎవరు ఉండరని, ఈ సినిమా మొత్తం అమ్మవారి చుట్టూ పాత్ర తిరిగే కథాంశం ఉంటుంది.
దీంతో ఎల్లమ్మ సినిమాలో దేవత పాత్ర కోసం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని సంప్రదించినట్లుగా వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ ఎల్లమ్మ పాత్రలో కనిపిస్తే ఆమె భక్తుడి పాత్రలో దేవిశ్రీప్రసాద్ పాత్ర ఉంటుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి కీర్తి సురేష్ తో కూడా డైరెక్టర్ వేణు చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ కీర్తి సురేష్ ఈ పాత్రకు ఓకే చెబితే ఈ ప్రాజెక్టు పైన అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉంది. తెలంగాణ సెంటిమెంటును మాస్ ఎలిమెంట్స్ తో కలిపి డైరెక్టర్ వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగానే ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి