హిందూ దేవతలను అవమానిస్తే హిందువులు అస్సలు ఊరుకోరు. కచ్చితంగా కేసులు పెడుతూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ తెలంగాణ వీరవనితులుగా పేరున్న సమ్మక్క సారలమ్మలను అవమానించింది అంటూ హిందువులు ఫైర్ అవుతున్నారు.. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..ఎందుకు ఆమెపై హిందువులు అంతలా మండి పడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం తెలంగాణలో ఏం నడుస్తుంది అంటే అందరూ సమ్మక్క సారలమ్మ వారి జాతర గురించే మాట్లాడుకుంటారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మవారి జాతర మేడారంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. మేడారంలో జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోనే అత్యంత భారీ ఆదివాసి జాతరగా.. కుంభమేళగా పేరు తెచ్చుకుంది.

 అయితే అలాంటి సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిందంటే చాలు చాలామంది భక్తులు నిలువెత్తు బంగారం అంటే తమ ఎత్తుకు తగ్గ బెల్లాన్ని దేవతలకు భక్తితో సమర్పిస్తారు.అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ తన పెంపుడు కుక్క కి నిలువెత్తు బంగారం ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వివాదంగా మారింది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో,కమిటీ కుర్రాళ్ళు వంటి సినిమాల్లో నటించిన నటి టీనా శ్రావ్య తాజాగా తన పెంపుడు కుక్కకి నిలువెత్తు బంగారం ఇచ్చింది. ఇక ఈ విషయాన్ని హీరోయిన్ తల్లి తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేయడంతో చాలామంది హిందువులు సమ్మక్క సారలమ్మని మీరు అవమానించారు..భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.కుక్క ఎత్తు బంగారం ఇవ్వడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.

అయితే ఈ విషయంపై హీరోయిన్ తల్లి క్లారిటీ ఇచ్చింది.మా పెంపుడు కుక్కకి సర్జరీ అయినప్పుడు కుక్క ఆరోగ్యం బాగుంటే నిలువెత్తు బంగారం ఇస్తామని ఆ అమ్మవారికి మొక్కుకున్నాము. అందుకే అలా చేసాము.ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏముంది అని కౌంటర్ ఇచ్చింది.ఇక హీరోయిన్ తల్లి ఇచ్చిన కౌంటర్ కి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. హీరోయిన్ చేసిన పనిలో తప్పేమీ లేదని కుక్క అయితే ఏంటి.. అది మాత్రం జీవి కదా.. దానికి మాత్రం ప్రాణం ఉండదా అంటూ మద్దతు తెలుపుతున్నారు. మరికొంత మందేమో మీరు చేసింది తప్పు దేవతలను అవమానించారంటూ ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: