కరోనా వల్ల దేశంలో చాలా మంది కన్నుమూశారు. ప్రభుత్వాలు కరోనా అంతానికి తగిన చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు విధిస్తూ కరోనా కేసులను తగ్గిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనాను అంతం చేసే చర్యల్లో భాగంగా వైద్యులు శానిటైజర్లు వాడాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ఇలా శానిటైజర్లు వాడటం వల్ల కరోనా కేసులు తగ్గాయి. ప్రజలు శుభ్రతను పాటించడం ద్వారా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా ఏ దుకాణానికో, లేదా షాపింగ్ చేయడానికో వెళ్లినప్పుడు శానిటైజర్ తీసుకెళ్లడం ఇప్పుడు పరిపాటిగా మారింది. శానిటైజర్ ఇప్పుడు సినిమా థియేటర్లలో అయినా హోటళ్లలో అయినా, బ్యాంకులు, షాపింగ్ మాల్సు..ఇలా అనేక ప్రదేశాలలో శానిటైజర్లను వినియోగించడం పరిపాటిగా మారింది. ఇలా వాడటం వల్లే కరోనా కేసులు ఎక్కువగా రావడం లేదని వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ శానిటైజర్లను వాడేవారు విపరీతంగా వాడటం కూడా ఓ ప్రమాదమే అని చెప్పొచ్చు. కొందరు శానిటైజర్ ను వాడే విధానం చూస్తే నవ్వు రాక మానదు. శానిటైజరును ఇలా కూడా వాడొచ్చా అని కొందరికి డౌట్ రాక మానదు. ఇలాంటి వీడియోలు ఈ మధ్య చాలానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శానిటైజర్లు వాడే విధానంగా ఇలాగేనా అని కొందరు కామెంట్లు గుప్పిస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. శానిటైజర్ లో కొన్ని చుక్కలు వేసుకుని వాష్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడొక వ్యక్తి శానిటైజర్ ను కాళ్లకు, చేతులకు, ముఖానికి, తలకు, తొడలకు..ఇలా స్నానం చేసినట్లు రాసుకున్నాడు. ఇది చూసి పక్కవారు నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియోను చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను 5,100 మంది చూశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: