అబ్బో..  ఈ రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు చాలా స్ట్రీక్ట్ అయిపోయారు అండి బాబు.  ఒకప్పుడు ఎవరైనా వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కాస్త జాలి చూపు చూసి చూడకుండా వదిలేసే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడూ అంటే జేబుకు చిల్లు పడే విధంగా ఫైన్ వేస్తున్నారు. అంతేకాదండోయ్  ఇక ఊహించని విధంగా చర్యలు కూడా తీసుకున్నారు. దీంతో ఇక ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాలి అంటే చాలు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే  సాధారణంగా కొన్ని ప్రాంతాలలో నో పార్కింగ్ జోన్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఇక ఎంత అత్యవసరం అయినప్పటికీ ఆ ప్రాంతాలలో మాత్రం వాహనాన్ని  అస్సలు పార్క్ చేయకూడదు. ఒకవేళ ఆదమరిచి నో పార్కింగ్ జోన్ లో బైక్ లేదా కారును పార్క్ చేసాము అంటే ఇక ఎన్నో ఇబ్బందులను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే ఇక మనం మన పనిలో బిజీగా ఉన్న సమయంలో అక్కడికి ట్రాఫిక్ పోలీసులు వస్తారు.  ఇక తమ దగ్గర ఉన్న క్రేన్ సాయంతో మన వాహనాన్ని బండి లో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత పోలీసు స్టేషన్కు వెళ్లి భారీగా జరిమానా కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.  అయితే ఒకవేళ ఇక ట్రాఫిక్ పోలీస్ వాహనం వచ్చిన సమయంలో నో పార్కింగ్ జోన్ లో ఉన్న వాహనదారులు తన బైక్ అక్కడి నుంచి తొలగిస్తూ ఉంటే ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు.



 ఇక్కడ మాత్రం ట్రాఫిక్ పోలీసులు తగ్గేదే లే అన్నట్లు గా వ్యవహరించారు  ఇటీవలే మహారాష్ట్రలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నో పార్కింగ్ చేసిన ఒక బైక్ ని ట్రాఫిక్ పోలీసులు దాదాపు ఎత్తి తన వాహనంలో పెట్టారు. ఆ సమయంలో వాహనదారుడు చూసి వెంటనే అక్కడికి వచ్చి దాన్ని ఆపేందుకు తన బైక్ పై కూర్చున్నాడు. పోలీసులు హెచ్చరించినప్పటికీ దిగడానికి మాత్రం నిరాకరించాడు. దీంతో పోలీసులు ఇక మోటార్ సైకిల్ రైడర్ తో పాటు పైకి లేపి వ్యాన్ గ్యారేజీ పై ఉంచారు. రైడర్ నో పార్కింగ్ లో బండి పార్క్ చేసినందుకు క్షమాపణలు చెప్పాడు జరిమానా కూడా చెల్లించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: