చలికాలం వచ్చిందంటే చాలు ప్రతి మనిషికి కూడా ప్రతి రోజు గడవడం ఒక పెద్ద టాస్క్ గా మారిపోతూ ఉంటుంది.  ఏం చేయాలి అన్న కూడా చలికి భయపడి పోతూ ఉంటారు. ముఖ్యంగా ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారు అయితే ఇక చలి తీవ్రతకు స్నానం చేయాలా వద్దా అని వందసార్లు ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పాలి. స్నానం చేసిన తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి కూడా బాగానే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా చలి కాలంలో స్నానం చేయడమంటే అందరికీ ఒక పెద్ద టాస్క్ గా మారిపోతూ ఉంటుంది. అలాగని స్నానం చేయకుండా ఉండలేం కదా అందుకే ఇక వేడినీళ్లతో స్నానం చేసి కాసేపు అయినా ఉపశమనం పొందాలి అని అనుకుంటూ ఉంటారు.



 అయితే ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏకంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసే స్థాయికి తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది అని చెప్పాలి.. దీంతో ఎంతో మంది బయటకు వెళ్లినప్పుడే కాదు ఇంట్లో కూర్చు న్నప్పుడు చలికి వణికి పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో చలి నుంచి ఎలా కాపాడుకోవాలిరా దేవుడా అంటూ ఎంతో మంది భయపడిపోయారు. ఇక ఎముకలు కొరికే చలిలో ఉదయాన్నే స్నానం చేయడం అంటే అమ్మో మా వల్ల కాదు బాబోయ్ అంటూ బెంబేలెత్తిపోయారు జనాలు.


 ఇలా చలి తీవ్రత పెరిగి పోయిన సమయంలో ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రస్తుతం అందరిదీ ఇదే పరిస్థితి ఉంది అని అనుకుంటున్నారు చాలామంది. ఈ వీడియో లో ఏముంది అంటే ఎక్కడో పిల్లాడు చలికి భయపడ్డాడో లేదా నీళ్లను పొదుపు చేయాలి అనుకున్నాడో తెలియదు కానీ ఏకంగా నీళ్లు వేడి చేయడానికి పొయ్యి మీద పెట్టిన బేసిన్ లోనే కూర్చొని స్నానం చేయడం మొదలుపెట్టాడు. కింది నుండి మంట వస్తుండగా ఒక వైపు నీళ్లు వేడి అవుతుంటే.. ఆ నీటిని తన ఒంటి పై పోసుకుంటూ  ఇక్కడ చలి తగలకుండా స్నానం చేస్తున్నాడు. ఈ వీడియో ఎన్నో రోజుల క్రితం సోషల్ మీడియాలో కి వచ్చినప్పప్పటికీ ఇప్పుడు చలి తీవ్రత పెరిగి పోవడంతో అందరినీ ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: