కుసుమ్ అనే యువతి విశాల్ అనే యువకుడిని ప్రేమించింది. కానీ ఆమె తల్లిదండ్రులు ఆమెను మరో వ్యక్తితో వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం తన ప్రియుడికి చెప్పాలని ఆమె పది రూపాయల కరెన్సీ నోటుపై ఒక సందేశం రాసింది. ఆ నోటుపై "విశాల్, నాకు ఏప్రిల్ 26న పెళ్లి నిశ్చయించారు. నువ్వు నన్ను లేపుకు పో. ఐ లవ్ యూ.. అని రాసింది.అలా ఆ నోటు ఓ సోషల్ మీడియాలో ఖాతాదారుడుకు చేరింది.. అతని ఆ ప్రేమ లేఖ ఇంట్రెస్ట్ గా ఉండటం తో దాన్ని ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లొ పోస్ట్ చేసి, వారిద్దరు కలుసుకొవాలని కోరుతూ ఒక ట్యాగ్ చేశాడు.
ఈ ఫొటో చూసిన వారందరూ కుసుమ్, విశాల్‌ని కలిపేందుకు సహాయం చేయండి. ఇద్దరు నిజమైన ప్రేమికులను కలిపేందుకు ట్విట్టర్ సత్తా ఏంటో చూపిద్దాం అని తన పోస్ట్‌లో రాశాడు. ఆ పోస్ట్ చదివిన నెటిజెన్లు రకరకాలుగా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు..విశాల్ పూర్తీ పేరు తెలుసుకుంటే మంచిది కదా అని కొందరు కామెంట్లు పెడుతూన్నారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.దాంతో ఇది నెట్టింట చక్కర్లు కోడుతుంది.. ఆమె కోరుకున్న విధంగా అతనికి ఆమె పెళ్ళి విషయం తెలుస్తుందా..లేదా.. అనేది తెలియాల్సి వుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి