నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో ఇక ప్రపంచం నలుమూలల జరిగిన ఘటనలు కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. వచ్చిన వీడియోలు కొన్ని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అడవిలో జీవించే క్రూరమృగాలు అయిన సింహం, చిరుత,పులి లాంటి జంతువుల సంబంధించిన వీడియోలు.. నీటిలో ఏనుగులు ముసలి పోట్లాడే వీడియోలు అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి.


 ఇక ఇటీవల ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు నోరెళ్లబెడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక్కసారి మొసలి నోటకరిచింది అంటే చాలు మనిషి మొసలి బారి నుంచి తప్పించుకోవడం దాదాపు కష్టమనే చెప్పాలి. ఎందుకంటే నీళ్ళలో ఉండే మొసలి బలం వేరేలా ఉంటుంది. సింహాలు ఏనుగులు సైతం గడగడ లాడుతూ ఉంటాయి. అంతేకాదు మనిషిని ఒక్కసారిగా మింగేస్తూ ఉంటుంది మొసలి.  కానీ ఇక్కడ వీడియోలో చూసుకుంటే మాత్రం మొసలి కడుపులో నుంచి ప్రాణాలతో ఒక వ్యక్తి బయటకు వచ్చాడు.


 ఇది వినగానే అవాక్కవుతున్నారు కదా.. కానీ ఇది నిజంగానే జరిగింది. ఏకంగా మొసలి కడుపులో ప్రాణాలతో ఉన్న వ్యక్తి తన చేతులు బయటకు పెట్టగా బయట ఉన్న వ్యక్తి అతని చేతిని పట్టుకొని బలంగా బయటకు లాగుతాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. బ్యూటీ వైల్డ్ లైఫ్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఇక ఈ వీడియో అప్లోడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎంతోమంది అది ఫేక్ మొసలి అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: