చైనా ఒకప్పుడు బాగా ఉన్న దేశం..కరొన తర్వాత ఆర్దికంగ వెనుక పడింది..వస్తు సేవల ధరలు భారీగా పెరగడంతో జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఓ వ్యక్తి సొంత ఇల్లు కొనుక్కోవాలని ఎప్పునించో అనుకుంటున్నాడు. చాలా ఇళ్లు చూశాడు. కానీ నచ్చలేదు. అలా వెతగ్గా వెతగ్గా ఓ ఇల్లు బాగా నచ్చింది..అతను ఆ ఇంటి ఓనర్ దగ్గరకు వెళ్ళి ఇల్లు కొనాలని అన్నాడు.ఇల్లు నచ్చింది కొంటాను అని చెప్పాడు. దానికి ఆ బిల్డర్ కూడా ఇంటి ధర చెప్పాడు. దానికి సదరు వ్యక్తి ఓకే రేపు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటానని వెళ్లిపోయాడు. అన్నట్లుగానే మరునాడు వచ్చాడు. వస్తూ వస్తూ కూడా ఓ ట్రక్కుడు పుచ్చకాయలు తెచ్చాడు. ఆ బిల్డర్ కూడా ఆ పుచ్చకాయలు చూసి మురిసిపోయాడు.


ఆ పుచ్చకాయలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టించాడు తన మనుషులతో..తరువాత తృప్తిగా ఓకే అంటూ పుచ్చకాలు తీసుకుని ఇంటి అగ్రిమెంట్ పేపర్లు సదరు వ్యక్తి చేతిలో పెట్టాడు. అదేంటీ ఇల్లు కొంటే డబ్బులు ఇవ్వాలిగానీ..పుచ్చకాయలు ఇవ్వటమేంటీ?.దానికి బిల్డర్ కూడా పుచ్చకాయలు తీసుకోవటమేంటి? అని ఆశ్చపోతున్నారా? అదే జరుగుతోంది.. అక్కడ ఇల్లు కొంటున్న వాళ్ళు డబ్బులకు బదులుగా పుచ్చకాయలు, వెల్లుల్లి, గోధుమలను ఇస్తున్నారట..2020 నుంచి కోవిడ్‌ మహమ్మారి విజృంభించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఆరు నెలల క్రితం నుంచి పలు దేశాల్లో వైరస్‌ ఉధృతి తగ్గుముఖం పడుతున్నా ఇప్పటికీ ఆర్థికంగా కోలుకోలేదు.


ఆహారం, చమురు, గ్యాస్‌ దిగుమతులు నిలిచిపోవడంతో పేద, ధనిక దేశాలు అన్న తేడా లేకుండా సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. నిత్యావసరాలు, ఇంధనం, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..గోధుమలు లేకపోతే వెల్లుల్లి తేవాలని కూడా సూచిస్తున్నారు. 16 రోజుల్లో 30 గోధుమల లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. బిల్డర్లు ఆశించినంతగా స్పందన లేదని విశ్లేషకులు చెబుతున్నారు.గతేడాది నుంచి చైనా వ్యాప్తంగా 70 శాతం ఇళ్ల విక్రయాలు పడిపోయాయి. 6 కోట్ల 50 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీగా బోసిపోయి కనిపిస్తున్ఇళ్లను వెల్లుల్లి, పుచ్చకాయలు, గోధుమలు వంటి వాటికి ఇళ్లను అమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: