ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిరోజు లక్షలు వీడియోలు సోషల్ మీడియా లో అప్ లోడ్ అవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి వీడియోలు ఎక్కువగా అడవిలోని జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్ల దృష్టి ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి వీడియో ఒకటి చెక్కర్లు కొడుతుంది. సాధారణంగా అడవికి రారాజు ఎవరు అంటే సింహం అని చెబుతారు ఎవరైనా.


 ఒక్కసారి సింహం ఏదైనా జంతువును వేటాడాలని నిర్ణయించుకుంది అంటే చాలు ఇక ఆ జంతువు సింహానికి ఆహారంగా పోవాల్సిందే. అంతేకాదు ఆ జంతువుకీ భూమ్మీద ఉండే ఆయుష్షు తీరినట్లే అవుతుంది. అందుకే ఏ జంతువు కూడా సింహం దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసం చేయవు. కేవలం చిన్న చిన్న జంతువులనే కాదు పెద్ద పెద్ద దున్నపోతులు జింకలు జిరాఫీలను సింహాలు వేటాడుతూ ఉంటాయి. సింహాలు అయితే అడవుల్లోనే భారీ జంతువులు గా పేరున్న ఏనుగులను వేటాడుతూ ఉంటాయి అని చెప్పాలి.  అయితే ఏనుగులను ఏ ఇతర జంతువులు కూడా సింహాల లాగా అంత సులభంగా వేటాడ లేవు.


 సింహాలు కూడా ఏనుగులను వేటాడటానికి అప్పుడప్పుడూ భయపడుతూనే ఉంటాయి అని చెప్పాలి. ఒకవేళ ఒకేసారి పదుల సంఖ్యలో సింహాలు దాడి చేస్తే  ఏనుగు లొంగిపోతు ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం సింహాలు ఎన్ని ఉన్నా ఏనుగు ప్రతిఘటిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో వైరల్ గా మారిపోయింది. అడవిలో ఉండే ఒక ఏనుగుల గుంపు నుంచి విడిపోయినట్లు కనిపిస్తోంది. మెల్లగా అక్కడ నీటిని తాగడానికి వచ్చింది. ఇది గమనించిన డజనుకు పైగానే సింహాలు అక్కడ చేరి పోయి ఏనుగు పై దాడి చేశాయి.. సింహాలు ఎంత గుంపుగా  వచ్చినప్పటికీ అటు ఏనుగు మాత్రం భయపడకుండా సింహాల గుంపును చెవులతో భయపడుతూ  గట్టిగా అరుస్తూ సింహాలను అక్కడినుంచి తరిమేసింది. ఈ వీడియో కాస్త అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: