ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలు తరచూ వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి. అయితే అటు వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా ఇలా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది అని చెప్పాలి. రోడ్డు నిబంధనలు పాటించాలని.. ప్రాణాలకూ రక్షణ కల్పించుకోవాలని.. మీకోసం ఇంటి దగ్గర కుటుంబం ఎదురుచూస్తుంది అంటూ ఇక ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అటు ఎంతో మంది నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.


 స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే పదాన్ని మరిచిపోయి అతివేగంగా వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తద్వారా ఇక వేగంగా ఉన్నా వాహనాన్ని కంట్రోల్ చేయలేక ప్రమాదాల బారినపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో గగుర్పాటుకు గురి చేసే ఎన్నో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది.. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి ట్విటర్ వేదికగా చక్కర్లు కొడుతుంది.


 అయితే ఇక ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం ఒళ్ళు జలదరించాల్సిందే. ఎందుకంటే సినిమాల్లో కూడా ఇంత భయానకమైన యాక్సిడెంట్ జరిగి ఉండదేమో అని అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. రోడ్డుపై వాహనదారులు వారి దారిన వారు వెళుతూ ఉంటారు. ఇంతలో అతివేగం కాదు అంతకుమించి అనే వేగంతోనే దూసుకు వచ్చిన ఒక బైకు నేరుగా కారును ఢీకొట్టింది. దీంతో బైక్ గాల్లో ఎగిరి పడగా.. ఇక బైక్ మీద ఉన్న వ్యక్తి అయితే సినిమాల్లో చూపించిన దానికంటే ఎక్కువగా గాల్లోకి ఎగురుతూ దూరంగా పడిపోయాడు. ఇక ఈ ప్రమాదంలో బైకర్ ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అన్నదానిపై మాత్రం సమాచారం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: