సాదరణంగా వైల్డ్ లైఫ్ వీడియోలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ల లాగా  జంతువుల దగ్గరికి వెళ్లి ఫోటోలు వీడియోలు తీసే ధైర్యం చేయలేరు. కానీ ఇలా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు తీసిన వీడియోలను మాత్రం చూడటానికి తెగ ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. అంతేకాదు ఇక జంతువులను జూలో చూడటం కాదు ఏకంగా నేరుగా లైవ్ లో చూసినట్లుగా ఈ వీడియోలను చూసి తెగ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ వీడియోలలో పులులు, సింహాలు లాంటివి వేటాడటం.. ఇక ఏనుగులు గుంపుగా కనిపించడం.. ఇక విష సర్పాలు దాడి చేయడం లాంటివి చూస్తూ ఉంటాం అని చెప్పాలి. ఈ క్రమంలోనే నీళ్లలో ఉండే మొసల్లు ఏకంగా భారీ జంతువులను సైతం అలవోకగా వేటాడి ఆహారంగా మార్చుకోవడం లాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా మొసల్లు ఇక నీళ్లలో ఉండే పక్షులను లేదా ఇతర చేపలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఇక గట్టు నుంచి నీళ్లు తాగుతున్న ఇతర జంతువులను కూడా వేటాడటం చేస్తూ ఉంటాయ్. కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రమైన ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఒక వీడియో వైరల్ గా మారిపోయింది.


 ఏకంగా ఒక భారీ మొసలి మరో చిన్న సైజు మొసలిని అమాంతం మింగేసింది. పాపం ఎంత ఆకలేసిందో ఏమో.. ఇలా చేపలను పక్షులను తినడం మానేసి ఏకంగా మొసలినే మింగడానికి సిద్ధమైంది మరో మొసలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. సౌత్ ఆఫ్రికాలోని కార్గోర్ నేషనల్ పార్క్ లో ఈ ఘటన జరిగింది అన్నది తెలుస్తూ ఉంది. అయితే ఈ వీడియో కాస్త పాతదే అయినప్పటికీ ఇప్పుడు మాత్రం వైరల్ గా మారిపోయింది. ఇది చూసి అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: