77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను అందించనున్నామని తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) తీపి కబురు అందించింది. ఈ రాయితీలు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు గమనించాలి. TSRTC తాజా ప్రకటన ప్రకారం, తెలంగాణ వ్యాప్తంగా 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు రేపు అంటే ఆగస్టు 15న పల్లె వెలుగు బస్సుల్లో టికెట్‌పై 50% రాయితీ అందుకోవచ్చు.
హైదరాబాద్ సిటీలో 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ ట్రావెల్‌కు సంబంధించిన టి-24 టికెట్ ధరలపై కూడా TSRTC 25 శాతం డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ టి-24 టికెట్‌ను ఆగస్టు 15న సాధారణ ప్రయాణికులు రూ.75కే, పిల్లలు రూ.50కే సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా ఈ అన్‌లిమిటెడ్ ట్రావెల్ టికెట్ ధర 120 రూపాయలు ఉంటుంది. మహిళలు, సీనియర్ సిటిజనులకు ఇది 100 రూపాయలు ఉంటే చిన్నపిల్లలకు 80 రూపాయలు ఉంటుంది. అయితే రాయితీ వల్ల ఇవి రేపు పైన చెప్పినట్లుగా కౌంటర్ ప్రైసెస్ లో అందుబాటులోకి రానున్నాయి.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు కొంతమందికి ఆఫీసులో కొంతసేపు మాత్రమే ఉంటాయి. పిల్లలకు స్కూల్, కాలేజీలు కూడా మధ్యాహ్నం లోపు క్లోజ్ అవుతాయి. ఖాళీ సమయం దొరికిన వీరందరూ హైదరాబాద్ నగరంలోని పర్యాటక ప్రాంతాలకు, పార్కులకు బస్సులో ఫ్రీగా ప్రయాణాలు చేయడానికి ఈ ప్రత్యేకమైన టికెట్ చాలా ఉత్తమంగా నిలుస్తుంది. ప్రజలు ఈ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని TSRTC అధికారులు కోరారు. ఈ రాయితీలను పొందాలంటే, ప్రయాణికులు తమ ఆధార్ కార్డును బస్ కండక్టర్‌కు తప్పక చూపించాలి.
TSRTC ఈ రాయితీలను ప్రకటించినందుకు ప్రజలు సంతోషిస్తున్నారని, ఈ రాయితీలు వారిని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సహాయపడతాయని భావిస్తున్నారు. రాయితీల గురించి మరింత సమాచారం కోసం, టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌ను లేదా టీఎస్ఆర్టీసీ కస్టమర్ కేర్ నంబర్‌ను సంప్రదించండి. అధికారిక టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్లో యాక్సెస్ చేయవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి