ఈ మధ్యనే తెలంగాణ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది.. దీంతో సీఎం గా రేవంత్ రెడ్డి తెలంగాణ బాధ్యతలను చేపట్టారు.. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చే వైపుగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తున్నది.

తెలంగాణలో డిగ్రీ, pg ,phd చేసిన ఉద్యోగాలు రాక తెలంగాణ యువతకు తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. Tspsc కమిషన్ ఏర్పాటులో కూడా లోపాలు ఉన్నాయని  హైకోర్టు మొదట్లోనే తెలియజేయడం జరిగిందని అలాగే అర్హత లేని వారిని కూడా ఇందులో నియమించాలని తెలియజేశారు. అయితే నిరుద్యోగులకు మాత్రం గుడ్ న్యూస్ తెలియజేస్తూ..త్వరలోనే రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతలను తీసుకుంటామని తెలియజేయడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..


 మెగా DSC నిర్వహించి ప్రభుత్వ విద్య ప్రమాణాలను  పెంచే దిశగా అడుగులు వేస్తామంటూ సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నో రోజుల నుంచి ఉపాధ్యాయుల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని గత ప్రభుత్వం DSC నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ తక్కువ పోస్టులతో పోస్టులను విడుదల చేయడంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది.. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ నిర్వహించటానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది.. ఇక నిరుద్యోగులకు ఈ విషయం తెలియగానే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీటితోపాటు తెలంగాణ ప్రభుత్వం లో ఉన్నటువంటి మొత్తం ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తానంటూ కూడా తెలియజేయడం జరిగింది రేవంత్ రెడ్డి. అందుకోసం మంత్రులకు సైతం యాయ శాఖలలో ఖాళీగా ఉన్నాయి అన్నిటిని గ్యాదర్ చేయాలంటూ అధికారులకు ఉత్తర్వులను కూడా జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: