గడిచిన రెండు మూడేళ్ల క్రితం కరోనా వైరస్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోయారు. ఇప్పుడిప్పుడే అలాంటి వైరస్ నుంచి బయటపడుతున్న తరుణంలో మళ్లీ పలు రకాల వైరస్లు కూడా అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బర్డ్ ఫ్లూ అనే వైరస్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ పలువురు నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలలో కూడా ఈ బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయట.


అయితే ఈ వైరస్ మనుసులకు సోకుతుందా ఈ వైరస్ సోకితే కోళ్లు పక్షుల లాగే మనసులు కూడా మరణిస్తారా అనే విషయంపై ప్రజలలో చాలా రకాల అనుమానాలు ఉన్నాయి..H5N-1 వంటి ఏవియన్ ఇన్ఫ్లుఎంజా  వైరస్  కొన్ని పక్షులకు మాత్రమే సోకుతుంది. దీనినే బర్డ్ ఫ్లూ అని పిలుస్తారట.. ఈ వైరస్ సోకిన పక్షులకు దగ్గరగా వెళితే మిగతా పక్షులకు కూడా ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ కారణంగా కోళ్లు పక్షులు సైతం త్వరగా మరణిస్తాయి. అలా సోకిన వైరస్ కోళ్లు పక్షులు మరణించిన వాటి దగ్గరకు వెళ్లిన పక్షులకు కూడా ఈ వైరస్ సోకుతుంది. ముఖ్యంగా నోటి నుంచి వచ్చే ద్రవాలు అలాగే పక్షుల రెట్టల ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందట.


అయితే ఈ వైరస్ సోకిన పక్షులలో ఎలాంటి లక్షణాలు కనిపించని చాప కింద నీరుల విస్తరిస్తుందట. పక్షులు కోళ్ల ఫారం నడిపే వారికి ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అయితే మరణించే శాతం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదు. ప్రస్తుతానికి బర్డ్ ఫ్లూ అయితే మానవులను  ఏమి చేయలేదని వైద్యులు తెలుపుతున్నారు. అయితే మనుషులలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. అందులో తలనొప్పి ,జలుబు, జ్వరము, దగ్గు ,కండరాల నొప్పులు మాత్రమే వస్తాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: