హత్రాస్ లో భోలె బాబా కార్యక్రమంలో ఈ తొక్కిస్తాలాట జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటన హత్రాస్ జిల్లా సికిందర్ రావు పోలీస్ స్టేషన్లో పరిధిలోకి వస్తుందట. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు సైతం హుటాహుటిగా సిబ్బందిని సంఘటన స్థలానికి తరలించినట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడ వెంటనే సహాయక చర్యలను సైతం పోలీసులు వేగవంతం చేశారు సమీపంలోని ఆసుపత్రికి సైతం తరలించినట్లుగా అక్కడ పోలీసులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అక్కడ మృతి చెందిన వారిగా మహిళలే ఎక్కువ శాతం ఉన్నట్లుగా తెలుస్తోంది... అలాగే చిన్నపిల్లలు పురుషులు కూడా ఉన్నారని సమాచారం. ఈ విషాదం పైన యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు సైతం సానుభూతి తెలపడం జరిగింది. వీటితోపాటు అక్కడ సహాయక చర్యలు వేగవంతం చేయాలి అంటే పలు రకాల ఉత్తర్వులను ఆదేశాలు జారీ చేశారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. బోలె బాబా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సంఘటన అటు యూపీ అంతట వాయిదాలుగా మారుతోంది. ఒక మత బోధకుడు తన అనుచరులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి