దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన ప్రళయం ఎంతోమంది కుటుంబాలలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఈ వైరస్ సృష్టించిన ప్రళయం గురించి ఊహించుకుంటేనే ఇప్పటికే ప్రజలు భయపడుతున్నారు. ఈ మహమ్మారి వైద్యులకి అంతుచిక్కడం లేదు. అయితే వీటినుంచి తప్పించుకోవడానికి వ్యాక్సిన్ వంటివి కనిపెట్టారు. కానీ ఇప్పుడు మళ్లీ కూడా తిరిగి కరోనా వైరస్ అన్ని ప్రాంతాలలో పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. 2019 లో కరోనా వైరస్ ప్రభంజనం ఒక పీడకలగా మిగిలిపోయింది. ఒకానొక సమయంలో హాస్పిటల్ లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి.. ఆక్సిజన్ లభించక చాలామంది మరణించారు. అయితే 2021 లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు కరోనా పేషెంట్ ని చంపేయాలంటూ మరొక వైద్యుడికి సూచించిన ఒక ఆడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. అసలు విషయంలోకి వెళ్తే.. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన  అజీముద్దీన్ గౌసోద్దీన్  తన భార్య కౌసర్ ఫాతిమాను  2021లో కరోనా సోకగా లాతూర్ లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారట. ఫాతిమ 10 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయ్యిందట. అయితే ఆ సమయంలో అదే ఆసుపత్రిలో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో ఆమెను చంపేయాలంటూ మరొక డాక్టర్ శశికాంత్  దేశ్ పాండే సూచించారట. ఇద్దరి సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్పు కూడా లీక్ అయింది.  తాజాగా ఇంటర్నెట్లో ఈ ఆడియో లింక్ వైరల్ కావడంతో వైద్యుడు దేశ్ పాండే పై ఆ దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 ముఖ్యంగా ప్రాణాలు పోతుంటే ప్రాణాలను కాపాడాల్సిన వైద్యుడే కులం,  మతం వివక్షతో చంపేయమని వ్యాఖ్యలు చేయడాన్నీ గౌసోద్దీన్ ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. తాను ఆ వ్యాఖ్యలను అప్పుడే ఫోన్ స్పీకర్ లో నుంచి విన్నానని, కానీ తన భార్య ఇంకా చికిత్స పొందుతున్నందున అప్పుడు మౌనంగా ఉన్నానని తెలిపారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో ఆ వ్యాఖ్యలు మళ్ళీ వినడం వల్ల తాను మానసికక్షోభకు గురయ్యానని, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని అతను కన్నీటి పర్యంతమయ్యారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదర్ డాక్టర్లకు నోటీసులు జారీ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: