ఈ మధ్యకాలంలో అనేక చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. స్కూల్లో హోంవర్క్ చేయలేదని టీచర్ అరిస్తే పిల్లలు కోపం చెందుతూ అనేక విధమైన చర్యలు తీసుకుంటున్నారు. గర్ల్‌ఫ్రెండ్‌కు బాయ్ ఫ్రెండ్ సరిగ్గా టైం కి రిప్లై ఇవ్వకపోతే కొంతమంది సూసైడ్ లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. భర్త అడిగింది తెచ్చిపోకపోతే కొంతమంది భార్యలు భర్తను మర్డర్ చేసి ముక్కలు చేసేస్తున్నారు .. ఇప్పుడు ప్రజలు ఇలాంటి ఘటనలను చూస్తూ షాక్‌కి లోనవుతున్నారు. .


ఇలాంటి ఘటనలలో తాజాగా ఒక ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది .. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం రైతు పొలంలో పనులు పూర్తి చేసి ఇంటికి వచ్చాడు. రోజువారీలా అన్నం పెట్టాలని భార్యని అడిగాడు. ఆ సమయంలో భార్య టీవీ సీరియల్‌లో మునిగిపోయి, “సీరియల్ పూర్తయ్యాక పెడతాను” అని చెప్పింది . .. దీనిపై భర్త కోపం చెందాడు. వారి మధ్య మాటల గొడవ పెద్దదిగా మారింది. ఆ రాత్రి పరిస్థితి సాదా అనుకున్నప్పటికీ, శుక్రవారం ఉదయం కూడా చిన్న విషయమే కారణంగా గొడవ మళ్లీ పెరిగింది ..



భర్త పొలంలోకి వెళ్లగానే ఆ కోపంలో భార్య గడ్డి మందు తాగి, తన 8 ఏళ్ల కుమారుడికీ తాగించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మరియు బాలుడిని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కొద్దిగా మెరుగైపోయింది. కానీ బాలుడి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. భార్య చిన్న విషయానికి ఇంత తీవ్రమైన పరిణామాలు తీసుకోవడం పై మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఎస్పై తిరుపతి వివరణ అడిగినప్పుడు, ఫిర్యాదు అందలేదని తెలిపారు. భర్త అన్నం పెట్టలేదని కోపంతో అరవడం, భార్య ఆ కోపంలో తన కొడుకుతో గడ్డి మందు తాగించడం చాలా దారుణమైన విషయం అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: