ప్రేమ అనేది ఎప్పటికీ అంచనాలకు లోబడని భావన. అది ధనిక–బీద తేడా చూడదు, కుల–మతాల గీతలు గుర్తించదు అని చాలామంది అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం ప్రేమ వయసు తేడాలను కూడా పట్టించుకోదని మరోసారి నిరూపిస్తోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న జంటను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ యువతి వయసు కేవలం 18 సంవత్సరాలు .. కానీ ఆమె ప్రియుడు 55 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి.. తండ్రి వయస్సులో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ యువతి తన ప్రేమకథను స్వయంగా చెబుతుంది. ఆమె అక్క అనారోగ్యంతో బాధపడుతుండడంతో, వంట చేసేందుకు అక్క ఇంటికి వెళ్ళిందట. అక్కడే చాలా రోజులు ఉండిపోవడంతో అక్క భర్తతో సన్నిహితంగా మారి, ప్రేమ పుట్టుకకు దారి తీసిందని తెలిపింది. ఆ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారని చెప్పడం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది.


ఆమె స్వ‌యంగా త‌న బావ‌ను ప్రేమ వివాహం చేసుకున్నాన‌ని చెపుతోన్న వీడియో సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటివరకు 4 లక్షల వ్యూస్‌ను దాటేసింది. దాదాపు 25 వేల లైక్‌లు, వందలాది కామెంట్లు వచ్చాయి. చాలా మంది నెటిజన్లు ఈ ప్రేమకథను ఫన్నీగా చూస్తూ సటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. “ఇంతలో మీ అక్క ఆరోగ్యం ఎలా ఉంది?” అని ఒకరు ప్రశ్నించగా, “అక్క శాశ్వతంగా అనారోగ్యానికి గురై ఉంటుందని అనిపిస్తోంది” అని మరొకరు వ్యాఖ్యానించారు.


ఇక మరికొందరు “ఇది ప్రేమనా లేక డ్రామానా?” అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. వయసు తేడా, బంధుత్వ సంబంధం వంటివి పట్టించుకోకుండా ప్రేమలో పడిన ఈ జంటపై సోషల్ మీడియాలో చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొందరు ప్రేమకు పరిమితులు ఉండవని చెబుతుండగా, మరికొందరు ఈ సంఘటనను నైతికంగా తప్పు అని విమర్శిస్తున్నారు. ఏదేమైనా, ఈ విచిత్రమైన ప్రేమకథ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: