ఐపీఎస్ కోసం.. ఇస్రో ఆఫర్‌ను తిరస్కరణ! .. త్రిప్తీ భట్ చదువులో ఎప్పుడూ ముందుండేది. ఆమె పంత్ నగర్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె ప్రతిభకు తిరుగులేదన్నట్లుగా... ప్రతిష్టాత్మకమైన ఎన్‌టీపీసీ (NTPC) తో పాటు, స్వయంగా ఇస్రో (ISRO) వంటి అగ్ర సంస్థలలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగావకాశాలు దక్కించుకుంది! ఏ యువతీ నిరాకరించలేని ఈ అత్యున్నత అవకాశాలు త్రిప్తీ ముందుకు వచ్చినా, ఆమె వాటిని పెడచెవిన పెట్టింది. ఎందుకంటే... ఆమె లక్ష్యం కేవలం ఉద్యోగం కాదు, ఐపీఎస్ (IPS) అధికారిణి కావడం! చిన్నతనం నుంచీ తన మనసులో దృఢంగా ఉన్న ఆ లక్ష్యం కోసం... ఏకంగా 16 ప్రభుత్వ ఉద్యోగాలను ఆమె త్యజించింది. ఇదంతా కనీవినీ ఎరుగని ధైర్యం, పట్టుదలకు నిదర్శనం!
తొలి ప్రయత్నంలోనే విజయం! .. మంచీమంచీ ఉద్యోగాలు వద్దనుకుని, దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష అయిన యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ వైపు అడుగులేసిన త్రిప్తీ భట్... తన పట్టుదల ఏంటో నిరూపించుకుంది. ఆమె మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి, ఐపీఎస్ అధికారిణిగా తన కలను నిజం చేసుకుంది! లక్షలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగ భద్రత కోసం తమ కలలను చంపుకుంటున్న ఈ రోజుల్లో, త్రిప్తీ భట్ కథ వారికి ఒక పవర్ఫుల్ మెసేజ్. ఖరీదైన ఆఫర్ల ముందు కూడా ఆమె తన లక్ష్యం వైపు దృఢంగా నిలబడింది. మనసులో ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటే, దాన్ని సాధించే క్రమంలో వచ్చే ఎలాంటి ఆటంకాన్నైనా, ఆకర్షణనైనా తిరస్కరించవచ్చు అని ఆమె నిరూపించారు. ఆమె సాధించిన ఈ విజయం... దేశ యువతకు ఒక గొప్ప స్ఫూర్తిదాయక శక్తి అనడంలో సందేహం లేదు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి