పెళ్లి అనేది ఇద్దరి వ్యక్తుల జీవితాలను ఏకం చేసే ఒక శుభ పరిణామం. ఇద్దరి వ్యక్తులతో పాటు రెండు కుటుంబాలను సైతం ఒకటిగా కలుపుతుంది. బంధాలను, బాంధవ్యాలను పెంచుతుంది. మన హిందువులకు ఇదో పెద్ద వేడుక. మన పూర్వీకుల నుండి వస్తున్న ఒక ఆచారం. హిందూ వివాహం ఆధునిక అర్ధంలో చెప్పబడే ఒక సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు మతపరంగా కూడా ఎంతో పవిత్రమైనది, ప్రత్యేకమైనది.