ఓ ఐదేళ్ల చిన్నారి వరల్డ్ రికార్డు క్రియేట్  చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ ఐదేళ్ల చిన్నారి అరిందం గౌర్‌ మన ఇండియా కు చెందిన వాడే కావడం గర్వించవలిసిన విషయం. 5 సంవత్సరాల, 05 నెలలు, 08 రోజుల వయసున్న అరిందం "ఫాస్టెస్ట్ 100 బాక్సింగ్ పంచెస్" చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. నిజానికి పెద్దవాళ్ళు కూడా చేయలేని ఈ పనిని ఈ చిన్నోడు అవలీలగా కానిచ్చేసి అందరికీ షాకిచ్చాడు. పైగా ఈ పని చేయడానికి పదమూడు సెకన్లు, ఏడు డెసి సెకన్లు (13 సె: 07 డి) తీసుకోవడం మరో విశేషం. మే 30న జరిగిన ఈ విశేషం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. అరిందంకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టమట. రోజుకు మూడు గంటల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటాడట. ప్రస్తుతం ఒకటవ తరగతి చదువుతున్న ఈ చిచ్చరపిడుగు బాక్సర్ విజేందర్ సింగ్, మేరీ కోమ్ ను అభిమానిస్తాడట.    

 

తన 5వ బర్త్ డే గిఫ్ట్ గా పంచ్ బ్యాగ్ ను అడిగాడట ఈ ఫ్యూచర్ బాక్సర్. అది విని అరిందం తండ్రి ఆశ్చర్యపోయారట. ముందుగా ఆయన తన కొడుకు మాటలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రానురానూ అరిందంలో పెరుగుతున్న పట్టుదలను చూసి అకాడమీలో చేర్పించారు. ఒకరోజు పేపర్ లో ఓ చిన్నారి ఇలాంటి రికార్డు సృష్టించిందని తెలుసుకున్న అరిందం తాను ఆ రికార్డును బ్రేక్ చేస్తానని చెప్పాడు. అన్నట్టుగానే ఇప్పుడు చేసి చూపించాడు కూడా. అరిందమ్ తండ్రి కూడా ఒకప్పుడు బాక్సింగ్ చేసేవాడట. 

 

కానీ స్లిప్ డిస్క్ కారణంగా ఆగిపోవాల్సి వచ్చిందట. ఇక శిక్షణ ప్రారంభించిన అనంతరం అరిందమ్ తండ్రి అతని ప్రతిభను గుర్తించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను సంప్రదించారు. వారు చెప్పిన విధంగానే అరిందమ్ చేసిన "ఫాస్టెస్ట్ 100 బాక్సింగ్ పంచెస్"ను వీడియో తీసి పంపారట. అది చూసిన గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ వారు ఈ రికార్డును అరిందమ్ సక్సెస్ ఫుల్ గా సాధించాడని తెలిపారట. ఇంత చిన్న వయసులో అరిందమ్ పట్టుదల, కృషి చూసి నోరెళ్లబెడుతున్నారు. ఏదేమైనా ఈ చిన్నారి చేసిన సాహసం చాలామందికి స్ఫూర్తినిస్తుందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: