మనం మనకి ఎంత స్వేచ్చ, ఆనందం అయితే దక్కాలి అనుకుంటామో అదే విధంగా ఇతరులకు కూడా అందాలి అని కోరుకున్న వాడే ఒక మనిషిగా విజయాన్ని పొందగలడు. ఎప్పుడు చూసినా ఎంత సేపు మన పని, మన సుఖ దుఃఖాలు, మన ఆలోచనలే ఉంటే దాన్ని స్వార్థం అంటారు, మనసు లేని మనిషి అంటారు కానీ వ్యక్తిత్వం, మానవత్వం ఉన్న మనిషిగా గుర్తించబడరు. ఎప్పుడైతే మీ వద్ద మానవతా విలువలు పుష్కలంగా ఉంటాయో అపుడే విజయం మిమ్మల్ని కోరి వరిస్తుంది. సాటి మనిషి కష్టాలలో ఉంటే కరగని మనసు, సాయం అందించ లేని చేయి, ఇతరులకు నష్టం కలిగించే జీవితం వృదా. ఇప్పుడు పైన తెలిపిన విషయాలు లేకుండా మీ జీవితం లేదు.

మీరు సంతోషకరమైన మరియు సంతృప్తికరమైన జీవితం పొందాలంటే ఇవన్నీ తప్పని సరిగా కలిగి ఉండాలి. ప్రతిక్షణం ఏదో ఒక సమయంలో ఇవి మీతో మిళితమై ఉంటాయి. ఇటువంటి భావాలు కలిగి ఉన్న వారు తాత్కాలికంగా విజయం పొందుతారు, కానీ ఆ విజయం దీర్ఘ కాలం మిమ్మల్ని ఆదరించలేదు. అలాగే మీకు పరిపూర్ణంగా ఉపయోగపడదు. ఇతరుల సంతోషంలో ఆనందాన్ని వెతకమని చెప్పడం లేదు. కానీ ఇతరుల దుఃఖానికి మాత్రం మీరు కారణం కాకపోతే చాలు. వీలైనంతలో తోటి వారికి సహాయం చేయండి. మీరు ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆ సహయమే మీకు మరో రూపంలో మీకు చేయూత అందిస్తుంది.

మీరు జీవించిన పూర్తి కాలంలో నలుగురు గుర్తించుకునేలా ఉండాలి. అంతే కానీ వీడు ఏమి మనిషిరా అనేలా ప్రవర్తించకూడదు. ఇది అంత ఈజీగా మీకు అలవాటయ్యే లక్షణాలు కాదు. మీరు మీరులా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి మీ చుట్టూ జరిగే ప్రతి ఒక్క విషయం జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు పొరపాట్లు జరగడానికి అవకాశం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: