కావల్సిన పధార్థాలు : బాస్మతి బియ్యం : 2 కప్పులు నూనె : 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయముక్కలు కప్పు దాల్చిన చెక్క : 2 అంగుళాలముక్క లవంగాలు : 4 ఆకుపచ్చ యాలకులు : 4 ఉప్పు : తగినంత పచ్చిమిర్చి : రెండు పచ్చిబఠాణీ : అరకప్పు (విడిగా ఉడికించి ఉంచుకోవాలి.) క్యారెట్ ముక్కలు : కప్పు టొమోటో : ఒకటి (సన్నగా ముక్కలు కోయాలి)


తయారీచేసే విధానం : బియ్యం కడిగి ఉంచాలి. ప్రెషర్ పాన్ లేదా కుక్కర్ లో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క లవంగాలు, యాలకులు వేసి వేయించాలి తరవాత ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు కడిగి నీళ్లు వంపేసిన బియ్యం వేసి వేయించాలి. మందపాటి గిన్నెలో 4 కప్పులు నీళ్లు మరిగించి వీటిని బియ్యంలో పోసి కలపాలి.


మంట తగ్గించి మూతపెట్టి ఉడికించాలి. విడిగా బాణలిలో కొద్దిగా నూనె వేసి క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, టొమోటో ముక్కలు, ఉడికించిన బఠాణీలు వేసి వేయించాలి. తరవాత వీటిని ఉడికించిన అన్నంలో కలిపి దించితే తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లోని రంగీలా పలావ్ రెడీ

మరింత సమాచారం తెలుసుకోండి: