తయారీలో వాడే పధార్థాలు :
వంకాయలు (గుండ్రనివి):250 గ్రా.
టొమోటాలు : 1
టామోటారసం :1/2కప్పు
వెల్లుల్లి, అల్లం పేస్టు :1/2 చెంచా
ఆమ్చూర్ పొడి : 1 చెంచా
కారం : 1 చెంచా
పసుపు : ½ చెంచా
సోంపు :1/2 చెంచా
పచ్చిమిర్చి : 1 చెంచా ముక్కలు
జీలకర్ర :1/2 చెంచా
గరంమసాలా : ½ చెంచా
జీలకర్ర పొడి :1/2
నూనె : 4 చెంచాలు
కొత్తీమీర : కోంచెం
తయారీ చేయువిధానం :
ముందుగా లేత వంకాయలు తీసుకొని మధ్య వరకు రెండు గాట్టు పెట్టి నాలుగు పక్షాలుగా చేసి ఉప్పు నీటిలో వేసి ఉంచాలి.
మందపాటి గిన్నెపెట్టి నూనె వేసి జీలకర్ర వేసి వేపాలి. తరువాత పసుపు కారం, సోంపు, జీలకర్ర. పొడి, ఆమ్ చూర్ పొడి, అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుతూవేపాలి.
వీటికి టొమోటా రసం, కొత్తిమీర కలిపి 2 నిమిషాలు వేయించాలి. వీటిలో వంకాయలని వేసి సరిపడ ఉప్పు చల్లి 2 నిమిషాలు కలుపుతూ వేపాలి. తరువాత గిన్నెమీద బౌల్ పెట్టి దాంట్లో నీరు పోసి సన్నని మంట మీద వంకాయలను మధ్యలో కలుపుతూ ఉడికించాలి.
వంకాయలు మగ్గిన తరువాత దించి బౌల్ లో పెట్టి పైన కొత్తిమీర టొమోటా ముక్కలు చల్లి వేడిగా రైస్ తో వడ్డించాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: