చపాతి, రోటి, పరోట ఐటమ్స్ లోకి పనీర్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు, పెద్దలుకూడా ఇష్టంగా ఆరగిస్తారు.  కావాలిసిన పధార్థాలు:  పనీర్ : 100 గ్రాములు ఉల్లిపాయలు : 2 లేక 3 చిన్నవి. పచ్చిమిరపకాయలు : 2 లేక 3  కారం : 1/2స్పూన్సు  అల్లం,వెల్లుల్లి: చిన్న ముక్క 4,5 చిన్న రెబ్బలు (ఈ రెంటిని కలపి మద్దలుగా నూరాలి) గరం మసాలా :కొద్దిగా గసగసాలు :10 గ్రాములు  ఉప్పు, పసుపు : తగినంత నూనె : ½ కప్పు జీడిపప్పు : 10 గ్రాములు తయారీచేయువిధానం : మొదటగా పన్నీర్ను రెండు భాగాలుగా కొంత ముక్కలుగానీ, మరికొంత తరిమి ఉంచుకోండి.  ఉల్లిపాయను ఉడికించి, మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి, గసగసాలు కూడా మెత్తగా మిక్సీ వేసి ఉంచాలి. బాండీలో నేనె పోసి, నూనె వేడి అయ్యాక, గ్రైండ్ చేసిన ఉల్లిముద్దను వేసి దోరగా వేయించండి.  ఆపై అల్లం, వెల్లుల్లి ముద్దను, పచ్చి మిరపకాయ ముక్కలను కూడా వేసి వేయించండి. కారం, ఉప్పు, పసుపు, గసగసాల ముద్దను కూడా వేసి బాగా కలియతిప్పండి. కట్ చేసిన పనీర్ ను అలాగే తురిమిన పనీర్ ను కూడా అందులో వేసి కలబెట్టి చిన్న మంట మీద ఉడికించండి సరిపడినన్ని నీళ్లు పోసి, తగనంద ఉప్పు, గరంమసాలా వేసి ఓ నిమిషం ఉంచి దించి రుచి చూడండి. సర్వ్ చేసే ముందు కొంచెం కాగిన నేతిలో జీడిపప్పు వేయించి గ్రేవీ మీద పోసి సర్వ్ చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: