జఫ్సా కేక్  ఎప్పుడైనా తిన్నారా.....?  కప్ కేకుల్లో చాక్లెట్ క్రీమ్‌ను పెట్టి నూనెలో దోరగా వేయించి సరికొత్తగా తయారు చేసారు. కేకుని నూనె లో వేయుంచడమేంటి రా..... జఫ్ఫా మొహల్లారా అని చిరగ్గా ముఖం పెట్టకండి ....ఇవి భలే రుచిగా ఉన్నాయని మెచ్చుకుంటున్నారు కూడా.  కానీ ఈ    జఫ్సా కేక్స్ ని మన ఇండియాలో తయారు చెయ్యట్లేదు.

వీటిని తినాలంటే మీరు  ఐర్లాండులోని ఆంట్రిమ్ కౌంటీకి వెళ్లాలి. మరి, మన బ్రహ్మనందం..ఊతపదంగా వాడిన ‘జఫ్ఫా’ పదం ఈ కేక్ కి ఎలా పెట్టారు అని  తెలుసుకోవాలంటే.. ‘జఫ్ఫా’ గురించి ముందుగా తెలుసుకోవాలి.అసలు ‘జఫ్ఫా’ అనేది తిట్టు కాదు. ఇజ్రాయెల్‌ సముద్ర తీరంలో ఉన్న ఓ పోర్టు సిటీ పేరు. అయితే, ఇలాంటి నగరం ఒకటి ఉందని మన తెలుగు ప్రజలకు తెలియదు.
అందుకే  బ్రహ్మీ దాన్ని ఊతపదంగా మార్చుకుని, అందరినీ జఫ్ఫాగాళ్లని తిట్టడంతో అంతా దాన్ని బూతుల జాబితాలో కలిపేశారు.


ఆ పేరుతో బ్రహ్మానందం  ఏకంగా సినిమాయే తీసాడు.  బ్రహ్మనందం..ఊతపదంగా వాడిన ఆ మాట తెలుగు తిట్ల డిక్షనరీలో ఎప్పుడో చేరిపోయింది. మరి, ఆ మాటకు అర్థం ఏమిటీ? ఆ పదం నిజంగా తిట్టేనా? అనే అనుమానం మాత్రం తెలుగు ప్రజల్లో అలాగే ఉండిపోయింది.


హాలోవీన్, క్రిస్మస్ పండుగలను పురస్కరించుకుని కో ఆంట్రిమ్‌లోని ఓ చిప్ షాప్ సరికొత్తగా వంటకంతో కస్టమర్లను సర్‌ప్రైజ్ చేయాలని భావించింది.  తమ స్టోర్‌కు వచ్చే కస్టమర్లకు ఉచితంగా ఈ జఫ్ఫా కేక్ పంచుతూ ఆకట్టుకుంటోంది.  అయితే, ఈ కేకుల పేరుకు జఫ్ఫా పేరునే ఎందుకు సెలక్ట్ చేసుకునేరనేది తెలియలేదు. తెలిసి పెట్టారో.. తెలియక పెట్టారో తెలీదుగానీ, ఈ కేకుకు ఆ పేరు కరక్టే అనిపిస్తోంది. 
మరిలేకపోతే ఏంటి....?  కేకుని నూనె లో వేయుంచడమేంటి అంటున్నారు భోజన ప్రియులు.


మరింత సమాచారం తెలుసుకోండి: